శాసనకర్తగా ఉద్ధవ్ థాకరే

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే శాసనమండలిలో అడుగుపెట్టాడు. శాసనమండలికి పోటీ లేకుండా ఉద్ధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయనతో పాటు మరో మరో ఎనిమిది మంది సభ్యులు ఏకగ్రీవమయ్యారు. ఇప్పటి వరకు ఉద్దవ్ థాకరే శాసనసభ, శాసనమండలి సభ్యుడు కాకుండానే సీఎంగా బాధ్యతలను చేపట్టారు. 6 నెలల్లోగా ఆయన ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సిన నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది కూడా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ […]

శాసనకర్తగా ఉద్ధవ్ థాకరే
Follow us

|

Updated on: May 14, 2020 | 8:40 PM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే శాసనమండలిలో అడుగుపెట్టాడు. శాసనమండలికి పోటీ లేకుండా ఉద్ధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయనతో పాటు మరో మరో ఎనిమిది మంది సభ్యులు ఏకగ్రీవమయ్యారు. ఇప్పటి వరకు ఉద్దవ్ థాకరే శాసనసభ, శాసనమండలి సభ్యుడు కాకుండానే సీఎంగా బాధ్యతలను చేపట్టారు. 6 నెలల్లోగా ఆయన ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సిన నేపథ్యంలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు మరో ఎనిమిది మంది కూడా ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శాసనమండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ నీలం గోర్హే (శివసేన), బీజేపీ నుంచి రంజిత్ సింగ్ మోహితే పాటిల్, గోపీచంద్ పడాల్కర్, ప్రవీణ్ డాట్కే, రమేశ్ కరాడ్, ఎన్సీపీ నుంచి శశికాంత్ షిండే, అమోల్ మిత్కారీ, కాంగ్రెస్ నుంచి రాజేశ్ రాథోడ్ ఉన్నారు. మండలిలో ఈ తొమ్మిది స్థానాలు ఏప్రిల్ 24న ఖాళీ అయ్యాయి. ఈ తొమ్మిది మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. నామినేషన్ల ఉపసంహరణకు ఈ మధ్యాహ్నం 3 గంటలకు సమయం ముగిసింది. తొమ్మిది స్థానాలకూ ఒక్కొక్క నామినేషన్ దాఖలు కావడంతో ఆ వెంటనే వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు అధికారులు ప్రకటించారు.

ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంతో… శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే శాసనకర్తగా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనని ఉద్దవ్ థాకరే.. గత ఏడాది నవంబర్ 28న ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ప్రమాణస్వీకారం చేశారు. మరోవైపు, ఎమ్మెల్సీగా ఉద్ధవ్ ఎన్నిక కావడంతో శివసైనికులు సంబరాలు జరుపుకుంటున్నారు.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎