Viral Video: మంత్రి బెడ్‌రూమ్‌లో నోట్ల కట్టలు.. మహా పాలిటిక్స్‌ను షేక్‌ చేస్తున్న వీడియో!

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన షేర్‌ చేసిన వీడియోలో అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి బెడ్‌రూమ్‌లో సిగరెట్ తాగుతూ.. పక్కనే డబ్బుతో నిండి ఉన్న పెట్టుకోవడం కనిపించింది. ఆ పక్కన మరో సూట్‌కేస్ కూడా కనిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Viral Video: మంత్రి బెడ్‌రూమ్‌లో నోట్ల కట్టలు.. మహా పాలిటిక్స్‌ను షేక్‌ చేస్తున్న వీడియో!
Viral Video

Updated on: Jul 11, 2025 | 9:05 PM

శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సోషల్‌ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఆయన షేర్‌ చేసిన వీడియోలో అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి బెడ్‌రూమ్‌లో సిగరెట్ తాగుతూ.. పక్కనే డబ్బుతో నిండి ఉన్న బ్యాగ్‌ను పెట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఎక్స్‌ వేదికగా ఈ వీడియోను పోస్ట్ చేసిన సంజయ్ రౌట్ వీడియో కింద క్యాప్షన్ ఇలా రాసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈ థ్రిల్లింగ్ వీడియోను చూడాలి, దేశంలో ఏం జరుగుతోందో.. మహారాష్ట్ర మంత్రికి చెందిన ఈ వీడియో చాలా చెబుతోందని వివరించారు.

మరోవైపు సంజయ్ రౌత్ ఆరోపణలపై మంత్రి సంజయ్ శిర్సాత్ స్పందించారు. ఇదంతా తనను ఇరికించేందుకు జరుగుతున్న కుట్రగా పేర్కొన్నారు. ఆ డబ్బు గురించి తనకేమి తెలియదని.. తాను ప్రయాణం నుంచి తిరిగి వచ్చాక.. బట్టలు తీసి పడకగదిలో కూర్చున్నానన్నారు.. అప్పుడు తన పెంపుడు కుక్క తన పక్కనే ఉందని.. బహుశా అప్పుడే ఎవరో వీడియో తీసి ఉంటారని తెలిపాడు. తన దగ్గర అంత డబ్బే ఉంటే బీరువాలో దాచే వాడిని స్పష్టం చేశారు. ఎవరో కావాలనే ఈ వీడియో తీసి.. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

ఇదిలా ఉండగా ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆయనకు నోటీసు జారీ చేసిన ఒకరోజు తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో దీనిపై త్వరలోనే ఆయన ఐటీ శాఖకు తన వివరణ ఇస్తానని స్పష్టం చేశారు. కొందరు కావాలనే తనపై ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారని.. అందుకే తనకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఈ నోటీసులపై సమాధానం ఇచ్చేందును తాను సమయం కోరినట్టు ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.