POCSO Act: చదువు పేరుతో ఉపాధ్యాయుడి పాడు పనులు.. సంచలన తీర్పు ఇచ్చిన ప్రత్యేక కోర్టు..

|

Mar 18, 2021 | 10:07 AM

POCSO Act: పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ కీచకుడికి ప్రత్యేక కోర్టు కఠిన శిక్ష..

POCSO Act: చదువు పేరుతో ఉపాధ్యాయుడి పాడు పనులు.. సంచలన తీర్పు ఇచ్చిన ప్రత్యేక కోర్టు..
Follow us on

POCSO Act: పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడిన ఓ కీచకుడికి ప్రత్యేక కోర్టు కఠిన శిక్ష విధించింది. ఫోక్సో చట్టాల్లో నిందితులపై శిక్ష విధించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు మదర్సా ఉపాధ్యాయుడికి 10 ఏళ్ల కఠిన జైలు శిక్షతో పాటు.. రూ. 30 వేల జరిమానా విధించింది. వివరాల్లోకెళితే.. 2018 సంవత్సరంలో ముంబైలోని చెంబూర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక తిలక్‌నగర్‌లోని మదర్సాలో చేరింది. అందుబాలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న వ్యక్తి(24) ఆ బాలికపై కన్నేశాడు. ఈ క్రమంలో ఓ రోజు.. మదర్సా సమయం అయిపోయాక విద్యార్థులందరూ బయటికి వెళ్లిపోయారు. అయితే, సదరు ఉపాధ్యాయుడు ఆ బాలికను వెనక్కి రమ్మని చెప్పాడు.

ఈ కీచకుడి బుద్ధి తెలియని బాలిక.. వెనక్కి వచ్చింది. తన పథకం ఫలించిందని భావించిన ఆ ఉపాధ్యాయుడు బాలికను టాయ్‌లెట్‌ గదుల్లోకి తీసుకెళ్లాడు. అక్కడ ఆ కీచకుడు చిన్నారిపై లైంగికంగా వేధించగా.. బాలిక ఏడ్చింది. దాంతో అతను ఆ బాలికను బయటకు తీసుకువచ్చాడు. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చివరికి ఆ బాలిక జరిగిన విషయాన్ని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. తాజాగా ఈ కేసులో విచారణ చేపట్టిన ప్రత్యేక కోర్టు.. నిందితుడికి 10 ఏళ్ల కఠిన విధించింది. దాంతో పాటు రూ. 30వేల జరిమానా విధించింది. ఈ రూ.30 వేలలో రూ. 20 వేలు బాధిత బాలికకు అందివ్వాలని ఆదేశించింది. కాగా, కోర్టు తీర్పును నిందితుడిని పోలీసులు జైలుకు తరలించారు.

Also read:

Telangana Corona Updates: తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. తాజాగా ఎన్ని కేసులు నమోదు అయ్యాయంటే..

కోటి ఎకరాల మాగాణం దిశగా తెలంగాణ.. సాగునీటి ప్రాజెక్టుల పూర్తితో మారిన దశ.. రికార్డు స్థాయిలో వరిసాగు

Telangana MLC Election Results 2021:పెద్దల పోరులో కారు జోరు.. హైదరాబాద్‌, నల్గొండ స్థానంలో పల్లా హోరు.. రెండో రౌండ్‌లోనూ దూకుడు..