Maharashtra Coronavirus Update: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రతి రోజు వేలల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. తాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,697 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 56 మంది మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అయితే ప్రతి రోజు దాదాపు మూడు వేల వరకు కేసులు నమోదు అవుతుండగా, 50 వరకు మరణాలు సంభవిస్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 20,06,354 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరణాల సంఖ్య 50,740కి చేరింది.
మరోవైపు గడిచిన 24 గంటల్లో 3,694 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఇక కరోనా నుంచి ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 19,10,521కి చేరింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 43,870 కేసులు యాక్టివ్‌లో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కేసుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటూ మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Also Read: Coronavirus Cases World: ప్రపంచ కరోనా అప్‌డేట్.. ఏడు కోట్లు దాటిన రికవరీ కేసుల సంఖ్య..