Maharashtra Corona Updates: మహారాష్ట్రలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు, పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,910 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 52 మంది మృతి చెందినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో మొత్తం 19,87,678 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 50,388 మంది మృతి చెందారు.
అలాగే గడిచిన 24 గంటల్లో 3,039 మంది కరోనాతో కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో కోలుకున్నవారి సంఖ్య 18,84,127కు చేరినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 51,965 యాక్టివ్ కేసులున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది.
కాగా, దేశ వ్యాప్తంగా కోవిడ్ వ్యాప్తి కొనసాగుతోంది. ఇప్పటి వరకు వైరస్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కారణంగా పాజిటివ్ కేసులు, మరణాలు అధికంగా సంభవించాయి. తాజాగా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కేసులు, మరణాల సంఖ్య తగ్గనున్నాయి.
Also Read: Ap Corona Cases: ఏపీలో కొత్తగా 114 వైరస్ పాజిటివ్ కేసులు.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా