Navneet Rana Case: మహారాష్ట్రకు పొంచివున్న పెనుప్రమాదం..! అందుకే హనుమాన్‌ చాలిసా పఠనం అంటున్న ఎంపీ నవనీత్‌ రాణా ..

|

May 14, 2022 | 6:00 PM

గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర సీఎంపై సంచలన ఆరోపణలు చేస్తూ..వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్న అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా మరోమారు ఉద్ధవ్‌థాక్రేపై ఘాటు వ్యాక్యలు చేశారు. ఉద్ధవ్ థాక్రే

Navneet Rana Case:  మహారాష్ట్రకు పొంచివున్న పెనుప్రమాదం..! అందుకే హనుమాన్‌ చాలిసా పఠనం అంటున్న ఎంపీ నవనీత్‌ రాణా ..
Mp Navanith
Follow us on

గత కొద్ది రోజులుగా మహారాష్ట్ర సీఎంపై సంచలన ఆరోపణలు చేస్తూ..వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తున్న అమరావతి ఎంపీ నవనీత్‌ రాణా మరోమారు ఉద్ధవ్‌థాక్రేపై ఘాటు వ్యాక్యలు చేశారు. ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్రకు పొంచి ఉన్న అతి పెద్ద ప్రమాదంగా ఆమె అభివర్ణించారు. ఈ ప్రమాదం నుండి మహారాష్ట్రను విముక్తి చేయడానికి తాను ప్రార్థనలు చేయడానికే వచ్చానన్నారు. ఈ మేరకు ఎంపీ నవనీత్‌ రాణా హనుమాన్‌ చాలీసా పఠించారు. కానీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే నివాసం మాతోశ్రీ వద్ద కాదు..దేశ రాజధాని ఢిల్లీలో. మహారాష్ట్ర పోలీసులు తనతోను, తన భర్త రవి రాణాతోనూ అమర్యాదగా ప్రవర్తించారని, నేరస్థుల కంటే హీనంగా చూశారని ఆరోపిస్తూ..ఎంపీ నవనీత్ రాణా లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నివాసం ఎదుట హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత రాణా దంపతులను ఏప్రిల్ 23న పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై రాజద్రోహం కేసు నమోదు చేశారు. ఈ కేసులో 12 రోజుల తర్వాత వారు బెయిలుపై విడుదలయ్యారు. ఈ క్రమంలోనే ఢిల్లీకి చేరకున్న రాణా దంపతులు కన్నాట్‌ప్లేస్‌లో ఉన్న ఆంజనేయుని ఆలయంలో హనుమాన్‌ చాలీసా పఠించారు.

గతంలో సినిమాల్లో నటించిన నవనీత్‌ కౌర్..రాజకీయ నేతను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పారు. అనంతరం పోలిటికల్‌ ఎంట్రీ ఇచ్చారు..గత సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం నుంచి ఇండిపెండెంట్‌గా బరిలో దిగి విజయం సాధించారు. అయితే, ఇటీవల హనుమాన్ చాలీసా విషయంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించారు. ఆయన హనుమాన్ చాలీసా పఠించకపోతే, తామే సీఎం నివాసం వద్దకు వెళ్లి పఠిస్తామని కౌర్ దంపతులు హెచ్చరించారు.

DMK leader’s murder: డీఎంకే నేత దారుణ హత్య, శరీరాన్ని ముక్కలుగా నరికేసిన మహిళ..ఇప్పటికీ దొరకని తల..!

Annavaram Temple: సత్యదేవుని ఉత్సవాల్లో అపచారం.. మందు, చిందులతో అశ్లీలం, చర్యలు తప్పవంటున్న ఆలయ ఈవో..

TTD VIP break darshan: వెంకన్న భక్తులకు ముఖ్య గమనిక..! సామాన్యులకు టీటీడీ పెద్దపీట వేసింది

Telangana : కర్మ భూమిలో పూసిన పూలు, కాళ్ల పారాణితో కాటిబాటపట్టిన పెళ్లికూతుళ్లు..మొన్న సృజన, నేడు లక్ష్మీ..