TTD VIP break darshan: వెంకన్న భక్తులకు ముఖ్య గమనిక..! సామాన్యులకు టీటీడీ పెద్దపీట వేసింది

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులకు పెద్ద పీట వేసింది. వేసవి సెలవులు కావటంతో తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు వెసులుబాటు కల్పిస్తూ టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

TTD VIP break darshan: వెంకన్న భక్తులకు ముఖ్య గమనిక..! సామాన్యులకు టీటీడీ పెద్దపీట వేసింది
Srivari Temple
Follow us
Jyothi Gadda

|

Updated on: May 14, 2022 | 3:52 PM

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తులకు పెద్ద పీట వేసింది. వేసవి సెలవులు కావటంతో తిరుమలకు విచ్చేసే సామాన్య భక్తులకు వెసులుబాటు కల్పిస్తూ టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వెంకన్న సన్నిధిలో సామాన్య భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ సిబ్బంది. ఇందులో భాగంగా జూలై 15వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసినట్టుగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రొటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్‌ ను పరిమితం చేశామని తెలిపారు. తద్వారా ఎక్కువ మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. క్యూలైన్లు, కంపార్టుమెంట్లలోని భక్తులకు సౌకర్యాలు మరింతగా పెంచారు. నిరంతరాయంగా అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీరు, అల్పాహారం, వైద్య సౌకర్యాలను క్రమంగా అందిస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆలయ మాడ వీధుల్లో భక్తులకు ఎండ వేడి నుండి ఉపశమనం కల్పించేందుకు చలువపందిళ్లు, చలువ సున్నం, కార్పెట్లు వేశామన్నారు.

పేదలకు తమ పిల్లల వివాహాలు ఆర్థికభారం కాకుండా శ్రీవారి ఆశీస్సులతో ఉచితంగా వివాహాలు నిర్వహించే కల్యాణమస్తు కార్యక్రమాన్ని త్వరలో తిరిగి ప్రారంభిస్తామన్నారు ఈవో. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఏప్రిల్‌ 24 నుంచి ప్రత్యేక దర్శనాన్ని పునరుద్ధరించినట్లు ధర్మారెడ్డి చెప్పారు. ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు ఎక్కువ స‌మ‌యం వేచి ఉండ‌కుండా నిర్దేశిత స్లాట్‌లో స్వామివారి దర్శనం కల్పిస్తున్నామన్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే లక్షలాది మంది భక్తులకు టీటీడీ అనేక సౌకర్యాలు కల్పిస్తోందని.. దీంతో పాటు విద్య, వైద్యరంగాలకు ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మే 15 నుంచి 17 వరకు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. 25 నుంచి 29వ తేదీ వరకు హనుమజ్జయంతిని ఆకాశగంగ వద్ద వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఇకపోతే, ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు ఎక్కువ స‌మ‌యం వేచి ఉండ‌కుండా నిర్దేశిత స్లాట్‌లో స్వామివారి దర్శనం కల్పిస్తున్నామన్నారు.

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే