Maharashtra: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. మాస్కులు ధరించండి.. ముఖ్యమంత్రి విజ్ఞప్తి

|

May 26, 2022 | 7:17 PM

మహారాష్ట్రలో(Maharashtra) కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో గతంలో సడలించిన కొవిడ్ నిబంధనలను సడలించే దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ...

Maharashtra: కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.. మాస్కులు ధరించండి.. ముఖ్యమంత్రి విజ్ఞప్తి
Uddav
Follow us on

మహారాష్ట్రలో(Maharashtra) కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో గతంలో సడలించిన కొవిడ్ నిబంధనలను సడలించే దిశగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ప్రజలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. జాగ్రత్తలు పాటించడంలో ఆలస్యం చేయవద్దని కోరారు. కరోనా(Corona) వైరస్‌ మన నుంచి పూర్తిగా పోలేదన్న ఉద్ధవ్ ఆస్పత్రిలో చేరికలు తక్కువే ఉన్నప్పటికీ అందరూ అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలన్నారు. మాస్కు ధరించడంతో పాటు అర్హులైన వారంతా తప్పనిసరిగా టీకాలు వేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారిలో 92.27శాతం మంది వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రలో మార్చి 5 తర్వాత తొలిసారి నిన్న 470 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క ముంబయిలోనే 295 కొత్త కేసులు వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది.

గతంలో మహారాష్ట్రలో మాస్కులు ధరించడం తప్పనిసరి కాదని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మరాఠీ నూతన సంవత్సరం అయిన గుడిపడ్వా సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందని తెలిపింది. కొవిడ్ నియంత్రణలు తొలగింపబడినప్పటికీ.. వైరస్ తో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. మాస్కులు వాడడం, వాడకపోవడం అనేది ప్రజల వ్యక్తిగత అభిప్రాయమని, అది తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్(Cabinet) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి