మహారాష్ట్రలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సం ఇంతాఅంతా కాదు. నదులు ఉప్పొంగి ప్రవహించడంతో.. రత్నగిరి, కొల్హాపూర్, సాంగ్లి సహా ఇంకా అనేక జిల్లాలు, నగరాలు జల విలయానికి గురయ్యాయి. ముఖ్యంగా రత్నగిరి జిల్లాలోని చిప్లన్ ప్రాంతంలోని బస్సు డిపో వద్ద నిలిపి ఉంచిన బస్సులన్నీ మునిగిపోయాయి. కేవలం బస్సుల టాప్ భాగాలు మాత్రమే కనిపించాయి. ఇంతటి విలయంలోనూ ఈ ప్రాంత బస్సు డిపో మేనేజర్ రంజిత్ రాజే షిర్డే చేసిన సాహసం, తన విధి పట్ల చూపిన నిబద్ధత మాత్రం మరవలేమని అంటున్నారు. ట్రాన్స్ పోర్ట్ రెవెన్యు డిపార్ట్ మెంటుకు చెందిన 9 లక్షల రూపాయల నగదు..నీళ్ల పాలు కాకుండా చూసేందుకు ఈయన ఓ బస్సు టాప్ మీదికెక్కి అలాగే 7 గంటలపాటు అక్కడే గడిపాడట.. నా ప్రాణాలు పోయినా సరే.. ఈ ప్రభుత్వ సొమ్మును కాపాడడం తన బాధ్యతగా భావించానని ఆయన చెప్పాడు. క్షణక్షణానికీ నీటి ఉధృతి పెరుగుతుండడంతో.. ఆఫీసులోనే ఈ క్యాష్ ఉన్న పక్షంలో కరెన్సీనోట్లన్నీ తడిసిపోతాయని, లేదా ఈ డబ్బు గల బాక్స్ కొట్టుకుపోతుందని, అందువల్ల తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీన్ని పట్టుకుని బస్సు టాప్ మీదికెక్కానని ఆయన వెల్లడించాడు. అలా సుమారు 7 గంటల పాటు గడిపానన్నాడు. ఇతర ఉద్యోగులు కూడా తనలాగే బస్సుల టాప్ మీద చేరినట్టు ఆయన చెప్పాడు.
క్రమంగా నీటి మట్టం తగ్గుతూ వచ్చాక తామంతా టాప్ మీది నుంచి దిగి ఈ డబ్బును సేఫ్ లొకేషన్ లో ఉంచామని షిర్డే తెలిపాడు. తాము పడిన అవస్థలను మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన రత్నగిరి డివిజన్ కార్యాలయ అధికారులకు తెలిపినట్టు ఆయన చెప్పాడు. మహారాష్ట్రలో వరదల కారణంగా 52 మంది మరణించగా వందమందికి పైగా గల్లంతయ్యారని తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చూడండి : రెండు డోసులతోనే డెల్టా కు చెక్..!రానున్న మరో ప్రమాదకరమైన మూడు వేరియంట్లు..:Control Delta with two doses Video.