Bird flu: రోజు రోజుకు విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ.. మహారాష్ట్రలోని 9 జిల్లాల్లో 382 పక్షులు మృతి

|

Jan 15, 2021 | 7:52 AM

బర్డ్ ఫ్లూ సోకి మరణించిన పక్షుల సంఖ్య 3,378 కి చేరింది. లాతూర్, నాందేడ్, నాసిక్, అహ్మద్‌నగర్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదైనాయి. జనవరి(గురువారం) 14వతేదీన 382 పక్షులు మరణించడంతో...

Bird flu: రోజు రోజుకు విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ.. మహారాష్ట్రలోని 9 జిల్లాల్లో 382 పక్షులు మృతి
Follow us on

బర్డ్ ఫ్లూ..ఇప్పుడు భారత్‌లోని చాలా రాష్ట్రాలను వణికిస్తున్న పెద్ద సమస్య. కుప్పలు కుప్పలుగా పక్షులు నేలరాలుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని తొమ్మిది జిల్లాల్లో తాజాగా 382 పక్షులు బర్డ్ ఫ్లూ వల్ల మరణించాయి.

దీంతో బర్డ్ ఫ్లూ సోకి మరణించిన పక్షుల సంఖ్య 3,378 కి చేరింది. లాతూర్, నాందేడ్, నాసిక్, అహ్మద్‌నగర్ జిల్లాల్లో బర్డ్ ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదైనాయి. జనవరి(గురువారం) 14వతేదీన 382 పక్షులు మరణించడంతో వీటి నమూనాలను భోపాల్, పూణే నగరాల్లోని జాతీయ పక్షుల వ్యాధుల నివారణ సంస్థలో పరీక్షించారు.

ముంబై, ఘోడ్ బందర్, దాపోలి ప్రాంతాల్లో కాకులు, కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకింది. పర్బనీ, లాతూర్, బీడ్, నాందేడ్ జిల్లాలోని బర్డ్ ఫ్లూ సోకింది. అకోలా, అమరావతి, అహ్మద్ నగర్, పూణే, షోలాపూర్ నగరాల్లోని కోళ్ల నుంచి సేకరించిన నమూనాలు బర్డ్ ఫ్లూ నెగిటివ్ అని తేలింది.

ముంబై, బీడ్, థానే, రత్నగిరి, నాసిక్, నాందేడ్ ప్రాంతాల్లోని కాకుల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించగా బర్డ్ ఫ్లూ పాజిటివ్ అని వెల్లడైంది. బర్డ్ ఫ్లూ ప్రబలకుండా కేంద్రంతోపాటు మహారాష్ట్ర సర్కారు చర్యలు తీసుకుంటోంది.

ఇవి కూడా చదవండి :

ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషన్‌కి అంతా సిద్ధం.. ప్రతి సెంటర్‌లో తొలిరోజు 100 మందికి టీకా.. రేపు ప్రారంభించనున్న ప్రధాని

రాజధానిలో కొనసాగుతున్న రైతు సంఘాల ఆందోళన.. ఢిల్లీ గవర్నర్ హౌస్ వద్ద ర్యాలీలో పాల్గొననున్న రాహుల్ గాంధీ