మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటోల్ రాజీనామా.. ఆయన అందుకోసమే వైదొలిగారా..?

స్పీకర్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ నార్హరి జిర్వాల్‌కు అందజేశారు నానా పటోల్.

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటోల్ రాజీనామా.. ఆయన అందుకోసమే వైదొలిగారా..?

Updated on: Feb 04, 2021 | 7:04 PM

Maharashtra Speaker Resigns : మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటోల్ గురువారం తన పదవికి రాజీనామా చేశారు. స్పీకర్ పదవి నుంచి వైదొలుగుతున్నట్లు తన రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్ నార్హరి జిర్వాల్‌కు అందజేశారు. కాంగ్రెస్‌కు చెందిన పటోలే రెండు రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లి ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన తన స్పీకర్ పదివికి రాజీనామా సమర్పించారు. అయితే , పటోల్ తదుపరి మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.

పీసీసీ చీఫ్‌గా నియమితులు కానున్నందున ఆయన స్పీకర్‌ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మిత్రపక్షాలకు కాంగ్రెస్‌ సమాచారం ఇచ్చింది. గతంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరిన పటేల్ 2014లో భండారా-గోండియా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017 బీజేపీకి గుడ్‌ బై చెప్పి.. 2018లో తిరిగి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. 2019లో మహారాష్ట్రలోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ సారథ్యంలో ఏర్పాటైన మహావికాస్‌ అఘాడీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

భండారా జిల్లాలోని సాకోలికి చెందిన ఎమ్మెల్యే పటోల్ త్వరలో రెవెన్యూ మంత్రి బాలసాహెబ్ తోరత్ స్థానంలో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇదీ చదవండి… మంచు దుప్పటి కప్పేసిన సిమ్లా.. ప్రక‌ృతి అందాలను అస్వాదించిన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ