Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maharashtra: మహారాష్ట్రలో ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ.. అనర్హత వేటు వేస్తే ముఖ్యమంత్రి పదవి పోతుందా..?

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో పాటు ఆయన గ్రూపులోని 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఈరోజు అంటే జనవరి 10న నిర్ణయం తీసుకోనున్నారు. సమాచారం ప్రకారం సాయంత్రం 4 గంటలకు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Maharashtra: మహారాష్ట్రలో ఎమ్మెల్యేల అనర్హతపై ఉత్కంఠ.. అనర్హత వేటు వేస్తే ముఖ్యమంత్రి పదవి పోతుందా..?
Maharashtra Politics
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 10, 2024 | 12:23 PM

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో పాటు ఆయన గ్రూపులోని 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ఈరోజు అంటే జనవరి 10న నిర్ణయం తీసుకోనున్నారు. సమాచారం ప్రకారం సాయంత్రం 4 గంటలకు నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. మంగళవారం నాడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నర్వేకర్ శివసేన ఇరువర్గాల ఎమ్మెల్యేల వాదనలు పూర్తి చేసి నిర్ణయాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం.

నేటి నిర్ణయంతో అందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. రాజ్యాంగంలోని నిబంధనలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే చట్టం నిర్ణయం తీసుకుంటుంది. ఈ నిర్ణయానికి ముందు, ఉద్ధవ్ గ్రూప్ ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ, మహారాష్ట్ర రాజ్యాంగ విరుద్ధ ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరాలుగా పనిచేస్తోందని అన్నారు. చట్టం ప్రకారం ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉండలేరన్నారు.

ఇదిలావుంటే లు ఫడ్నవీస్, అజిత్ పవార్ ఇద్దరూ సీఎం ఏక్నాథ్ షిండే వర్ష బంగ్లాకు చేరుకుని ఆయనతో సమావేశమయ్యారు. సీఎం బంగ్లాలో జరిగిన సమావేశంలో మహారాష్ట్ర కొత్త డీజీపీ రష్మీ శుక్లా, ముంబై పోలీస్ కమిషనర్ కూడా పాల్గొన్నారు. కర్ ఏ నిర్ణయం తీసుకున్నా మా ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని ఫడ్నవీస్ అన్నారు. పొత్తు చట్టపరంగా చెల్లుబాటవుతుందని, స్పీకర్ నిర్ణయం కూడా అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామన్నారు ఫడ్నవీస్. అయితే దీనికి సంబంధించి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ స్పీకర్ నర్వేకర్ మంగళవారం చెప్పారు. డెసిషన్ మేకింగ్ ప్రాసెస్‌పై ఒత్తిడి తెచ్చేందుకు కొందరు వెర్రి ఆరోపణలు చేస్తున్నారని, అయితే చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుంటానని మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తెలిపారు.

పార్టీని వీడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయంలో ముందస్తు నిర్ణయం తీసుకోవాలని శివసేన (ఉద్ధవ్ వర్గం) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి 2 లక్షల 71 వేల పేజీలకు పైగా పత్రాలు దాఖలయ్యాయని విచారణ సందర్భంగా నర్వేకర్ కోర్టుకు తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా కొనసాగుతున్నాయి. అందువల్ల, నిర్ణయం తీసుకోవడానికి 3 వారాలు పడుతుంది. దీంతో షిండే వర్గం ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి రాహుల్ నర్వేకర్‌కు డిసెంబర్ 14, 2023న సుప్రీంకోర్టు మరో 10 రోజుల గడువు ఇచ్చింది. నార్వేకర్‌కు గతంలో డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. సుప్రీంకోర్టు గడువును జనవరి 10, 2024 వరకు పొడిగించింది.

స్పీకర్ నర్వేకర్ వాదనపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. నిర్ణయం ఆలస్యం కావడానికి అసెంబ్లీ స్పీకర్ చెప్పిన కారణాలు చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. నిర్ణయాన్ని వెల్లడించేందుకు స్పీకర్‌కు జనవరి 10 వరకు సమయం ఇస్తున్నామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…