Viral Video: ఒక్కడ్ని కాపాడబోతే ఇలా జరిగింది ఏంటి..? పాపం 37 మంది…

సోమవారం మధ్యాహ్నం లాతూర్-నాందేడ్ హైవేలోని నందగావ్ పాటి సమీపంలో మోటార్ సైకిల్‌ను తప్పించబోయి మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (MSRTC) బస్సు బోల్తా పడింది. మధ్యాహ్నం 1:43 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 37 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.

Viral Video: ఒక్కడ్ని కాపాడబోతే ఇలా జరిగింది ఏంటి..? పాపం 37 మంది...
Maharashtra Bus Accident

Updated on: Mar 04, 2025 | 3:28 PM

ఒక్కడిని కాపాడబోతే ఆరుగురి ప్రాణాలపైకి వచ్చింది. హైవేపై సడన్‌గా యూటర్న్‌ తీసుకోబోయిన బైకర్‌ను తప్పించబోయిన క్రమంలో ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటన మహారాష్ట్రలోని లాతూర్-నాందేడ్ హైవేపై జరిగింది. ఈ ప్రమాదంలో 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు.

బైక్‌పై వస్తున్న వ్యక్తి రోడ్డు దాటేందుకు ట్రై చేసిన టైమ్‌లో వెనుక వస్తున్న బస్సును గమనించ లేదు. సడన్‌గా రోడ్డు మధ్యకు బైక్‌ వచ్చేస్తుండడంతో అతన్ని తప్పించబోయిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌.. పూర్తిగా రైట్‌కి కట్‌ చేయడంతో అది అవతలి పక్కకు వెళ్లి బోల్తా కొట్టింది. గాయపడిన వారిని చికిత్స కోసం లాతూర్‌లోని విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ఆస్పత్రికి తరలించారు. అహ్మద్‌పూర్ డిపో కింద ఈ బస్సు లాతూర్ వైపు వెళుతుండగా, చకూర్ తాలూకాలోని నందగావ్ పాటి సమీపంలో యాక్సిడెంట్ జరిగింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..