హైదరాబాద్‌ వస్తుండగా పుణేలో కుప్పకూలిన హెలికాప్టర్‌.. పైలట్‌తో సహా నలుగురికి సీరియస్!

|

Aug 24, 2024 | 5:53 PM

మహారాష్ట్ర లోని పుణేలో ప్రైవేట్‌ సంస్థ హెలికాప్టర్‌ కుప్పకూలింది. వాతావరణం అనుకూలించకపోవడంతో పౌడీ గ్రామం లోని పొలాల్లో హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేసేందుకు పైలట్‌ ప్రయత్నించినప్పుడు ప్రమాదం జరిగింది.

హైదరాబాద్‌ వస్తుండగా పుణేలో కుప్పకూలిన హెలికాప్టర్‌.. పైలట్‌తో సహా నలుగురికి సీరియస్!
Pune Helicopter Crashes
Follow us on

మహారాష్ట్ర లోని పుణేలో ప్రైవేట్‌ సంస్థ హెలికాప్టర్‌ కుప్పకూలింది. వాతావరణం అనుకూలించకపోవడంతో పౌడీ గ్రామం లోని పొలాల్లో హెలికాప్టర్‌ను ల్యాండ్‌ చేసేందుకు పైలట్‌ ప్రయత్నించినప్పుడు ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌ చెట్టును ఢీకొని పొలాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌తో సహా నలుగురికి తీవ్రగాయాలయ్యాయని స్థానిక పోలీసులు తెలిపారు.

పూణే జిల్లాలోని పౌడీ ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లో నలుగురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా ముగ్గురికి అత్యవసర చకిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం పూణేలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలి కూడా బలంగా ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. బలమైన గాలులు, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ఎస్పీ పంకజా దేశ్‌ముఖ్‌ ప్రకటన వెలువడింది. పూణేలోని పౌడ్ గ్రామ సమీపంలో ఒక ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ హెలికాప్టర్ ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందినది. అది ముంబై నుంచి హైదరాబాద్ వెళ్తోంది. హెలికాప్టర్‌లో నలుగురు వ్యక్తులు ఉన్నారని పంకజా దేశ్‌ముఖ్‌ పేర్కొన్నారు.

వీడియో చూడండి…

ఈ సంఘటన జరిగిన ప్రదేశం చాలా మారుమూల ప్రాంతం. అక్కడికి వెళ్లడం చాలా కష్టం. రోడ్డుకి చాలా దూరంగా ఉంటుందని స్థానికులు తెలిపారు. గత రెండు రోజులుగా ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి, బహుశా దీని వల్ల ఏదైనా జరిగి ఉండవచ్చు అని అధికారులు భావిస్తున్నారు. హెలికాప్టర్ AW 139, పైలట్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా కంపెనీకి చెందినది. గాయపడిన కెప్టెన్ ఆనంద్ సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అందులో డీర్ భాటియా, అమర్‌దీప్ సింగ్, ఎస్పీ రామ్ అనే మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..