
మాఘ పూర్ణిమ సందర్భంగా ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయడానికి కోట్లాదిమంది భక్తులు తరలివస్తున్నారు. భారీగా ట్రామ్ జామ్ ఏర్పడడంతో అధికారులు ప్రయాగ్‌రాజ్‌ను నో వెహికిల్ జోన్‌గా ప్రకటించారు. శని , ఆదివారాల్లో ప్రయాగ్‌రాజ్‌కు వచ్చే హైవేపై 300 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు 30 గంటల పాటు ట్రాఫిక్‌లో ఇరుక్కొని చాలా అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్‌కు క్రమబద్దీకరించడానికి పోలీసులు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు . మౌని అమావాస్య నాడు జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకొని అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులకు పార్కింగ్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రయాగ్‌రాజ్ సరిహద్దు జిల్లాల్లో కూడా పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో ఇప్పటివరకు 45 కోట్ల మంది పుణ్యస్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు పారిశ్రామిక వేత్త అంబానీ కుటుంబం కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించింది. నాలుగు ప్రత్యేక హెలికాప్టర్లలో అంబానీ కుటుంబ సభ్యులు ప్రయాగ్‌రాజ్ చేరుకున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో మాఘ పూర్ణిమ సందర్బంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. 190 అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు.