
ఈశా ఫౌండేషన్ శ్మశానవాటిక నిర్మాణానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. ఈషా ఫౌండేషన్ కాలభైరవర్ ధగన మండపం నిర్మాణాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు ఇటీవల కొట్టివేసింది. తమిళనాడు గ్రామ పంచాయతీ నిబంధనలు ప్రకారం.. నివాస స్థలం లేదా తాగునీటి సరఫరా ఉన్న ప్రాంతాల నుంచి సుమారు 90 మీటర్ల లోపు శ్మశాన వాటికకు లైసెన్స్ మంజూరు చేయడాన్ని నిషేధించలేదని చీఫ్ జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాస్తవ , జస్టిస్ జి. అరుళ్ మురుగన్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. నిబంధనల ప్రకారం, గ్రామ పంచాయతీ నుండి లైసెన్స్ పొందడం మాత్రమే ముందస్తు అవసరం అని కోర్టు స్పష్టం చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.