Village Name Changed: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని హౌషంగాబాద్ గ్రామం పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు. ‘నర్మదా జయంతి’ సందర్భంగా ఆ గ్రామానికి నర్మదాపురం అని పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తాననిపారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటనపై బీజేపీ ప్రజాప్రతినిధులు, బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. సరైన నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసించారు. కేంద్రం కూడా రాష్ట్ర విజ్ఙప్తిని పరిగణనలోకి తీసుకుని గ్రామ పేరును మర్చేందుకు అనుమతించాని కోరారు. కాగా, గతంలో సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ సహా పలువురు నేతలు హోషంగాబాద్ గ్రామం పేరును మార్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ గ్రామానికి నర్మదా నది పేరు వచ్చేలా ‘నర్మదాపురం’ అని పేరు పెట్టాలని సూచించారు. ఈ డిమాండ్లు, సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తాజాగా గ్రామం పేరును మారుస్తున్నట్లు ప్రకటించారు.
Also read:
Ayodhya ram mandir: అయోధ్య రామాలయ నిర్మాణం.. భారీగా విరాళం ప్రకటించిన మాజీ ముఖ్యమంత్రి కోడలు..