దుర్మార్గులారా మరీ ఇలా ఉన్నారేంట్రా.. పిల్లలు దాచుకున్న దాన్ని కూడా వదల్లేదు..

| Edited By: Ravi Kiran

Dec 23, 2022 | 7:35 AM

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఓ పోలీసు అధికారి ఇంటిని టార్గెట్ చేసుకున్నారు దోపిడీ దొంగలు. ఇంట్లో ఉన్న రూ. 20 లక్షల విలువైన ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. అంతేకాదు.. చిన్నారుల పిగ్గీ బ్యాంకును..

దుర్మార్గులారా మరీ ఇలా ఉన్నారేంట్రా.. పిల్లలు దాచుకున్న దాన్ని కూడా వదల్లేదు..
Robbery
Follow us on

మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఓ పోలీసు అధికారి ఇంటిని టార్గెట్ చేసుకున్నారు దోపిడీ దొంగలు. ఇంట్లో ఉన్న రూ. 20 లక్షల విలువైన ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. అంతేకాదు.. చిన్నారుల పిగ్గీ బ్యాంకును సైతం పగలగొట్టి అందులో ఉంచిన డబ్బును కూడా ఎత్తుకెళ్లారు. అదే సమయంలో ఇంట్లో ఉంచిన కొన్ని పత్రాలను కూడా ఎత్తుకెళ్లారు దుండగులు. ఆ పోలీస్ ఇంట్లోనే కాదు.. పక్కింట్లోనూ చోరీకి పాల్పడ్డారు దుండగులు. ఇంట్లో ఉంచిన రూ.6 వేల నగదు, నగలతోపాటు సుమారు రూ.50 వేలు ఎత్తుకెళ్లారు. రెండు ఇళ్లలో లక్షల రూపాయల చోరీ జరిగినట్లు కొలారస్ పోలీస్ వెల్లడించారు.

కొలారస్ పట్టణంలోని బదర్వాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ చోరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హెడ్ కానిస్టేబుల్ కదమ్ సింగ్ మాంఝీ ఇంట్లో దొంగలు పడ్డారు. నహర్ సింగ్(కానిస్టేబుల్), ఆయన కూతురు కృష్ణ మాంఝీ ఇద్దరికీ ఆరోగ్యం బాగోలేకపోవడంతో.. చికిత్స నిమిత్తం గ్వాలియర్ వెళ్లారు. తాళం వేసిన ఇళ్లే టార్గె్ట్‌గా దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో ఉంచిన, నగదు, నగదు అన్నీ ఎత్తుకెళ్లారు కేటుగాళ్లు.

అప్పు కోసం దాస్తే..

ఈ చోరీపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు హెడ్ కానిస్టేబుల్ కదమ్ సింగ్. తన కుమారుడు అనారోగ్యంతో మృతి చెందాడని, అతనికి చికిత్స కోసం లక్షల రూపాయలు అప్పు చేశానన్నారు. ఆ అప్పు తీర్చేందుకు దాచిన డబ్బును దొంగలు ఎత్తుకెళ్లారంటూ లబోదిబోమన్నాడు. సుమారు రూ. 20 లక్షలు ఎత్తుకెళ్లారని వాపోయాడు.

పిల్లల పిగ్గీ బ్యాంకును కూడా వదల్లేదు..

లక్షల రూపాయలు ఎత్తుకెళ్లిన కేటుగాళ్లు.. పిల్లల పిగ్గీ బ్యాంకులను కూడా వదిలిపెట్టలేదు. తన కూతూరు బిడ్డ ఒక సంవత్సరం పాటు బిగ్గ బ్యాంక్‌లో డబ్బులు దాచుకుందని, దొంగలు దానిని కూడా ఎత్తుకెళ్లారని వాపోయారు. అంతేకాదు.. ఇంట్లో విలువైన పత్రాలను సైతం ఎత్తుకెళ్లారన్నారు. ఈ చోరీపై కేసు నమోదు చేసుకున్న కొలారస్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..