ఆక్టివాతో వార్తల్లోకి ఎక్కాడు.. ఎలాగో తెలిస్తే నవ్వుకుంటారు..!

జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటారు. అలానే మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి పుర్రెకు తట్టిన ఐడియా ఆయన్ను ఇప్పుడు వార్తల్లోకి ఎక్కించింది. చేసిన పని చిన్నదనుకున్నా.. బహుశా.. ఇలాంటి పని చేసి వాహనం కొన్నది ఇతనేనేమో. సాధారణంగా మనం వాహనం కొనాలనుకుంటే మంచి రోజు.. ముహూర్తం చూస్తాం. ఇంకా కొనే రోజు పండుగ రోజైతే ఇంకా బాగుంటుందనుకుంటాం. అలా చేస్తే మనకు వాహనం కొన్న విషయం సులువుగా గుర్తుండిపోతుంది అన్న ఆశ కూడా. అయితే మధ్యప్రదేశ్‌లోని వ్యక్తి.. […]

ఆక్టివాతో వార్తల్లోకి ఎక్కాడు.. ఎలాగో తెలిస్తే నవ్వుకుంటారు..!
Follow us

| Edited By:

Updated on: Oct 27, 2019 | 6:38 AM

జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అంటారు. అలానే మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తి పుర్రెకు తట్టిన ఐడియా ఆయన్ను ఇప్పుడు వార్తల్లోకి ఎక్కించింది. చేసిన పని చిన్నదనుకున్నా.. బహుశా.. ఇలాంటి పని చేసి వాహనం కొన్నది ఇతనేనేమో. సాధారణంగా మనం వాహనం కొనాలనుకుంటే మంచి రోజు.. ముహూర్తం చూస్తాం. ఇంకా కొనే రోజు పండుగ రోజైతే ఇంకా బాగుంటుందనుకుంటాం. అలా చేస్తే మనకు వాహనం కొన్న విషయం సులువుగా గుర్తుండిపోతుంది అన్న ఆశ కూడా. అయితే మధ్యప్రదేశ్‌లోని వ్యక్తి.. పొలిటికల్ లీడర్లను ఫాలో అయినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే గతంలో ఓ పొలిటికల్ లీడర్‌ నామినేషన్ దాఖలు చేసేందుకు వినూత్నంగా వెళ్లాడు. అంటే చిత్రవిచిత్ర వేషాలు కాదండోయ్.. నామినేషన్‌కు సమర్పించే డబ్బుల విషయంలో. వెరైటీగా ఉండి వార్తల్లోకి ఎక్కాలనుకుని.. నామినేషన్‌కు సమర్పించాల్సిన డబ్బును చిల్లరను తీసుకెళ్లి.. ఎన్నికల అధికారులకు.. మీడియాకు గుర్తుండిపోయేలా చేశాడు. ఆయన్ను చూసి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పలుచోట్ల అలాంటి ఘటనలు జరిగాయి.

అయితే తాజాగా మధ్యప్రదేశ్‌ సత్నా జిల్లాకు చెందిన రాకేష్ కుమార్ గుప్తా కూడా ఇలాంటి పనిచేసి వార్తల్లోకి ఎక్కారు. దీపావళి సందర్భంగా ఆక్టివా 125 వాహనం కొనాలని నిశ్చయించకున్నాడు. అంతే షోరూం వెళ్లి దాని ధర వివరాలు కనుకున్నాడు. దాని ధర రూ. 83వేలు అని తెలిసి.. అంత డబ్బు సమకూర్చుకుని షోరూం మెట్టెక్కాడు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా.. అక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఆ ఆక్టివా కోసం డబ్బును కరెన్సీ నోట్లతో కాకుండా చిల్లర నాణేల రూపంలో చెల్లించాడు. దీంతో అదిచూసిన షోరూం సిబ్బంది అవాక్కయ్యారు.

స్థానిక హోండా డీలర్‌షిప్‌ నుంచి బండి కొనుగోలు చేసిన రాకేశ్‌.. వారికి రూ. 83వేల విలువ గల నాణేలు చెల్లించారు. ఇందులో ఎక్కువగా రూ.5, రూ. 10 నాణేల ఉన్నాయట. దీంతో ఆశ్యర్యపోయిన డీలర్‌షిప్‌ సిబ్బంది మొత్తం 3 గంటలకు పైగా శ్రమించి నాణేలను లెక్కించారట. అయితే రాకేశ్‌ అంతమొత్తాన్ని నాణేల రూపంలో ఎందుకు చెల్లించారో తెలియదు గానీ.. ఆయన ఫొటోలు, డీలర్‌షిప్‌ సిబ్బంది నాణేలను లెక్కబెడుతున్న ఫొటోలు మాత్రం ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. కొంటే ఇలానే కొని రికార్డులకెక్కాలంటూ కామెంట్లు పేలుతున్నాయి. పుర్రెకొచ్చిన ఐడియా.. ఇవాళ వార్తల్లోకి ఎక్కెలా చేసింది రాకేష్‌ కుమార్ గుప్తాను.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు