మధ్యప్రదేశ్‌లోని విదిషలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళ నాలుగు కాళ్లతో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బాలిక ఆరోగ్యంగా ఉంది. అయితే వైద్యులు మెరుగైన చికిత్స కోసం బాలికను భోపాల్‌కు రెఫర్ చేశారు. బాలిక కుటుంబం కుర్వాయి తహసీల్‌లోని జోనఖేడి గ్రామ నివాసి. తల్లి పేరు ధనుష్ బాయి, తండ్రి పేరు ఫూల్ సింగ్ ప్రజాపతి. మండి బమోరా ప్రభుత్వ ఆసుపత్రిలో ధనుష్ బాయి ఈ పాపకు జన్మనిచ్చినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో చర్చనీయాంశంగా మారింది. డాక్టర్ రాజేష్ చెప్పిన ప్రకారం ఈ రకమైన కేసును వైద్య భాషలో ‘ఇషియోపాగస్’ అంటారు. వేలాది మందిలో ఒకరు మాత్రమే ఇలా పుడతారని.. శిశువులో అదనపు అవయవాలు ఈ విధంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు.
నవజాత శిశువుకు శారీరక వైకల్యం ఉంది. కడుపులో పెరుగుతున్న బిడ్డలో శరీరం కింది భాగం అదనంగా అభివృద్ధి చెందడం వలన ఇలా జరిగిందని రాజేష్ వివరించారు. వేలాది మందిలో ఒకరికి మాత్రమే ఈ రకమైన సమస్య ఏర్పడుతుందని.. శిశివుని విదిషాకు, అక్కడి నుంచి భోపాల్‌కు రెఫర్ చేశారు.
బాలిక తండ్రి ఫూల్ సింగ్ ప్రజాపతి తనకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారని.. పెద్దమ్మాయి దిశాఖ 3వ తరగతి చదువుతుందని.. ఇద్దరు కవల పిల్లలు రెండేళ్ళని చెప్పారు. కూలీగా పనిచేస్తున్నాడు. ఇతనికి రేషన్ కార్డు కానీ ఆయుష్మాన్ కార్డు కానీ లేవు. కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కనుకనే అప్పుడే పుట్టిన తమ కుమార్తెను చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అంతేకాదు బాలిక చికిత్స కోసం ప్రభుత్వం సహాయం చేయాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.
ఈ విషయంపై సీఈవో శివరాజ్ సింగ్ అహిర్వార్ స్పందిస్తూ.. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను బాలిక కుటుంబానికి పూర్తి స్థాయిలో అందజేసేందుకు కృషి చేస్తామని హామీనిచ్చారు. పంచాయతీలోని ఉపాధి సహాయం కోసం రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. పంచాయితీ అతనికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తుందని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..