Super Lady Police: లేడి పోలీసు పెద్ద మనస్సు.. సాయం చేస్తూ.. స్ఫూర్తిగా నిలుస్తూ..

పోలీసులంటే చాలా మంది భయపడుతుంటారు. పోలీసులు కఠినంగా ఉంటారు. వారికి జాలి, ప్రేమ ఉండదనుకుంటారు. కానీ పోలీసులు కూడా మనలాగే మనుషులు. వారికి కూడా మనస్సు ఉంటుంది. వారి హృదయం కూడా స్పందిస్తుంది...

Super Lady Police: లేడి పోలీసు పెద్ద మనస్సు.. సాయం చేస్తూ.. స్ఫూర్తిగా నిలుస్తూ..
Helping

Edited By:

Updated on: Nov 30, 2021 | 5:03 PM

పోలీసులంటే చాలా మంది భయపడుతుంటారు. పోలీసులు కఠినంగా ఉంటారు. వారికి జాలి, ప్రేమ ఉండదనుకుంటారు. కానీ పోలీసులు కూడా మనలాగే మనుషులు. వారికి కూడా మనస్సు ఉంటుంది. వారి హృదయం కూడా స్పందిస్తుంది. ఇలానే మధ్యప్రదేశ్‎లో ఓ లేడి సబ్ ఇన్‎స్పెక్టర్ తన హృదయంతో స్పందించారు. రోడ్డు పక్కన నివసించే నిరాశ్రయులకు సాయం చేశారు. వారికి దుప్పట్లు అందించారు. పేదవారికి సాయం చేసేందకు ఆమె సోల్జర్ ఆఫ్ కోల్డ్’ అనే ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సబ్ ఇన్‌స్పెక్టర్ అనిలా పరాశర్ రోడ్డు పక్కన నివసించే నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అయితే దుప్పట్లు పంచడం ఈ ఒక్క రోజే కాదు రోజు సాయం చేస్తుంటారు. అంతేకాదు ఈ పని కోసం అనిలా పరాశర్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆమె ఈ బృందానికి ‘సోల్జర్ ఆఫ్ కోల్డ్’ అని పేరు పెట్టారు. “ఒక రోజు పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు, చలిలో మరణించిన మహిళను చూశాను. ఎవరైనా సమయానికి ఆమెకి దుప్పటి ఇచ్చి ఉంటే లేదా నైట్ షెల్టర్ ఇచ్చి ఉంటే ప్రాణాలు కాపాడేవారం. కానీ ఆమె మృతి చెందింది. దీంతో నేను చాలా బాధపడ్డాను. అప్పుడే అనుకున్నాను ఏదో ఒకటి చేయాలని” అని ఎస్‌ఐ అనిలా పరాశర్ తెలిపారు.

ఆ విషాదకరమైన సంఘటన తర్వాత అనిల పరాశర్ ఈ పవిత్ర కార్యం శ్రీకారుం చుట్టారు. ఇప్పుడు ఇండోర్‌లో చలి కాలంలో రోడ్డు పక్కన నిరాశ్రయులైన వారి తమ బృందం సాయం చేస్తుందని SI అనిలా పరాశర్ చెప్పారు. నిరాశ్రయులకు సాయం చేస్తూ అనిలా పరాశర్ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.

Read Also.. PM Narendra Modi: మాజీ ప్రధాని దేవగౌడతో నరేంద్రమోడీ భేటీ .. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్..