Dog Attack: ఇద్దరు డాక్టర్లతో సహా ఐదుగురిపై దాడి చేసిన వీధి కుక్క.. అనంతరం అక్కడికక్కడే మృతి

|

May 12, 2023 | 5:49 PM

వీధికుక్క దాడిలో ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లతో సహా ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ క్యాంపస్‌లో గురువారం (మే 11) ఈ సంఘటన చోటుచేసుకుంది. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో జరిగిన కుక్కల దాడుల్లో..

Dog Attack: ఇద్దరు డాక్టర్లతో సహా ఐదుగురిపై దాడి చేసిన వీధి కుక్క.. అనంతరం అక్కడికక్కడే మృతి
Dog Attack
Follow us on

వీధికుక్క దాడిలో ఇద్దరు రెసిడెంట్ డాక్టర్లతో సహా ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ క్యాంపస్‌లో గురువారం (మే 11) ఈ సంఘటన చోటుచేసుకుంది. గత ఏడాది కాలంగా రాష్ట్రంలో జరిగిన కుక్కల దాడుల్లో ఇది 16వది కావడం విశేషం. పెంపుడు కుక్కల దాడులు 7 జరుగగా.. వీధికుక్కల దాడి కేసులు 9 నమోదయ్యాయి.

క్యాంపస్‌లోని రేడియాలజీ విభాగం వెలుపల ఉన్న వ్యక్తులపై కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. ఈ ఘటనలో డాక్టర్ సుష్మా యాదవ్, సంజయ్ గుప్తా అనే ఇద్దరు డాక్టర్లతోపాటు, ఇద్దరు పారామెడికల్ సిబ్బంది, అటెండర్‌ గాయపడ్డట్లు కేజీఎంయూ అధికారులు తెలిపారు. వారికి ప్రథమ చికిత్స అందించి, వ్యాక్సిన్‌ చేశామన్నారు. ఘటన అనంతరం కుక్కను బంధించేందుకు యూనివర్శిటీ అధికారులు లక్నో మున్సిపల్ కార్పొరేషన్‭కి సమాచారం అందించారు. ఐతే మున్సిపల్ టీం వచ్చేలోపే అది చనిపోయిందని తెలిపారు. కుక్క రేబిస్‌తో బాధపడుతోందని, ఈ వ్యాధి ఇతర కుక్కలకు వేగంగా వ్యాపిస్తుందని, ఈ వ్యాధి సోకిన వారంలోపూ కుక్కలు మృతి చెందుతాయని ఎల్‌ఎంసి చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ డాక్టర్ అభినవ్ వర్మ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.