Viral: ఒక్క రోజులో ఆ రైతు లక్ తిరిగిపోయింది.. ఫేట్ మారిపోయింది…
మధ్యప్రదేశ్‌లో ఓ రైతు సుడి తిరిగింది. దెబ్బతో రాత్రికి రాత్రే లక్షాధికారి అయిపోయాడు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి
Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఓ రైతుకు అదృష్టం కలిసివచ్చింది. ఒక్క రోజులో అతని ఫేట్ మారిపోయింది. లక్షలకు అధిపతి అయిపోయాడు. పన్నా(Panna)లో సదరు రైతు ఓ చిన్న గనిని లీజుకు తీసుకున్నాడు. అక్కడ అతడికి 11.88 క్యారెట్ల నాణ్యమైన వజ్రం దొరికింది. జిల్లాలోని పట్టి ప్రాంతంలోని ఒక గనిలో కూలీగా పనిచేస్తున్న చిన్నపాటి రైతు ప్రతాప్ సింగ్ యాదవ్ ఈ వజ్రాన్ని కనుగొన్నట్లు వజ్రాల అధికారి రవి పటేల్ బుధవారం మీడియాకు తెలిపారు. నాణ్యమైన ఈ వజ్రాన్ని త్వరలో జరగనున్న వేలంలో అమ్మకానికి ఉంచి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ధరను నిర్ణయిస్తామని వెల్లడించారు.
“నేను తక్కువ వ్యవసాయ భూమి ఉన్న పేదవాడిని. బయట కూలి పని కూడా చేస్తున్నాను. గత మూడు నెలలుగా ఈ గనిలో కష్టపడి ఈ వజ్రాన్ని కనుగొనగలిగాను. డైమండ్ వర్క్‌ప్లేస్‌లో వేలం ద్వారా వచ్చిన డబ్బుతో వ్యాపారాన్ని ప్రారంభిస్తాను. పిల్లల చదువుల కోసం మరికొంత వినియోగిస్తాను వినియోగిస్తాను” అని రైతు ప్రతాప్ సింగ్ వెల్లడించాడు.
ప్రతాప్ సింగ్‌కు దొరికిన డైమండ్ రూ. 50 లక్షల కంటే ఎక్కువ పలకవచ్చని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ముడి వజ్రాన్ని వేలం వేసి, ప్రభుత్వ రాయల్టీ, పన్నులు మినహాయించి వచ్చిన మొత్తాన్ని రైతుకు అందజేస్తామని అధికారులు తెలిపారు. కాగా పన్నా జిల్లాలో 12 లక్షల క్యారెట్ల వజ్రాల నిల్వలు ఉన్నాయని అంచనా.
Also Read: Hyderabad: ఇంట్లో గోల్డ్ మిస్సింగ్.. విచారణలో బయటపడ్డ కుమార్తె బాగోతం.. మైండ్ బ్లాంక్ అంతే
మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..