Dirty Video Viral: ఏకాంతంగా ఉన్న ప్రేమికులపై పోకిరీల దాడి.. యువతిని వేధిస్తున్న వీడియో వైరల్‌

వైరల్ అవుతున్న వీడియోలో..అమ్మాయి ఏడుస్తూ.. తమను వదిలిపెట్టామని వేడుకోవడం కనిపిస్తుంది, అయినప్పటికీ ఆ దుర్మార్గుల హృదయం కరగలేదు. వారు ఆమెను, ఆమె ప్రేమికుడిపై తీవ్రంగా దాడి చేశారు. అసభ్యంగా ప్రవర్తించారు.

Dirty Video Viral: ఏకాంతంగా ఉన్న ప్రేమికులపై పోకిరీల దాడి.. యువతిని వేధిస్తున్న వీడియో వైరల్‌
Hamirpur Crime

Updated on: Aug 19, 2022 | 10:10 AM

Dirty Video Viral: యూపీలోని హమీర్‌పూర్‌లో మానవత్వం సిగ్గుపడే ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. ఏకాంతంగా ఉన్న ఇద్దరు ప్రేమికులను టార్గెట్‌ చేసిన అల్లరి మూకలు వారిని వేధించాయి. ఆరు పోకిరీలు వారిపై దాడికి పాల్పడ్డారు. అల్లరి మూకలంతా కలిసి వారిని వివస్త్రను చేసి, బాలికను వేధింపులకు గురిచేస్తూ విచక్షణా రహితంగా కొట్టారు. ఈ వీడియో వైరల్ కావడంతో హమీర్‌పూర్ పోలీసులు ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు యువకులు ఇంకా పరారీలో ఉన్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో..అమ్మాయి ఏడుస్తూ.. తమను వదిలిపెట్టామని వేడుకోవడం కనిపిస్తుంది, అయినప్పటికీ ఆ దుర్మార్గుల హృదయం కరగలేదు. వారు ఆమెను, ఆమె ప్రేమికుడిపై తీవ్రంగా దాడి చేశారు. అసభ్యంగా ప్రవర్తించారు. వారి వద్దనున్న డబ్బు నగలు లూటీ చేశారు. యువతిని శారీరకంగా, మానసికంగా వేధించి నగ్నంగా వదిలేసి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వేధింపులకు పాల్పడిన యువకులు సమీప గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. వీడియో ఆధారంగా ముగ్గురు యువకులు కన్హయ్య శర్మ, ప్రీతమ్ కశ్యప్, మహ్మద్ ఫజల్‌లను పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఆగస్ట్ 16న ఈ దారుణ సంఘటన జరిగింది. ఓ అమ్మాయి తన ప్రేమికుడితో కలిసి సిటీ ఫారెస్ట్‌కి వెళ్లింది. వారి రాకను పసిగట్టిన ఆరుగురు రౌడీ గ్యాంగ్‌ అక్కడికి చేరుకున్నారు. యువతి బట్టలు విప్పించి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో యువతితో పాటు ఆమె ప్రేమికుడిపై కూడా దాడి చేశారని పోలీసులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us