Sri Ram Story In Madrasas
శ్రీరాముడు అందరివాడు. ఆరాధ్య దైవం.. రామ్ రహీం ఒక్కడే అని చెప్పడమే కాదు.. చేతల్లో నిరూపిస్తూ ఉత్తరాఖండ్‌లోని వక్ఫ్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో ఉన్న మదర్సాలలో విద్యార్థులకు మహ్మద్ ప్రవక్తతో పాటు శ్రీరాముడి కథను బోధిస్తామని వక్ఫ్ బోర్డు ఛైర్మన్ షాదాబ్ షామ్స్ తెలిపారు. తమ నిర్ణయంపై సొంత వర్గీయుల నుంచి వ్యతిరేకత వచ్చినా భయపడేది లేదంతున్నారు షాదాబ్ షామ్స్.
మదర్సాల ఆధునీకరణ కార్యక్రమంలో’ భాగంగా మార్చిలో ప్రారంభమయ్యే సెషన్‌లో ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్‌కు అనుబంధంగా ఉన్న వాటిల్లో కొత్త సిలబస్‌ను ప్రవేశ పెట్టనున్నామని తెలిపారు. కొత్త సిలబస్ లో శ్రీ రాముడికి సంబంధించిన అధ్యయనాన్ని ప్రవేశపెడతామని వక్స్ బోర్డు ఛైర్మన్ షాదాబ్ షామ్స్ గురువారం (జనవరి 25) తెలిపారు. ప్రవక్త మహమ్మద్‌తో పాటు శ్రీరాముడి జీవిత చరిత్రను మదర్సా విద్యార్థులకు బోధించనున్నట్లు తెలిపారు.
వక్స్ బోర్డు ఛైర్మన్ మాత్రమే కాదు బీజేపీ నాయకుడు కూడా అయిన షామ్స్.. అనుభవజ్ఞులైన ముస్లిం మతపెద్దలు కూడా తన ఆలోచనను ఆమోదించారని చెప్పారు. రాముడి విలువలను.. మతం లేదా విశ్వాసంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అనుసరించడం విలువైనదని అన్నారు.
కొత్త సిలబస్‌ను ఎక్కడ ప్రవేశపెట్టనున్నారంటే
- రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు పరిధిలో 117 మదర్సాలు ఉన్నాయని.. వాటిలో డెహ్రాడూన్, హరిద్వార్, ఉధమ్ సింగ్ నగర్, నైనిటాల్ జిల్లాల్లోని మదర్సాలలో తొలుత కొత్త సిలబస్‌ను ప్రవేశపెడతామని చెప్పారు.
- ఈ ఏడాది మార్చి నుంచి మదర్సా ఆధునీకరణ కార్యక్రమంలో భాగంగా వక్ఫ్ బోర్డుకు అనుబంధంగా ఉన్న మదర్సాలలో శ్రీరాముని పాఠాన్ని ప్రవేశపెడతామని షామ్స్ తెలిపారు.
- “తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం సింహాసనాన్ని వదులుకుని అడవికి వెళ్లిన వ్యక్తి! శ్రీరాముడి లాంటి కొడుకు కావాలని ఎవరు కోరుకోరు” అని షామ్స్ చెప్పారు
- 20వ శతాబ్దపు ముస్లిం తత్వవేత్త అల్లామా ఇక్బాల్‌ను ఉటంకిస్తూ షామ్స్ ఇలా అన్నారు.. రాముని తమ వాడైనందుకు హిందూస్తాన్ గర్విస్తుంది.. హిందువులు ఆయనను నాయకుడిగా భావిస్తారు ( “है राम के वजूद पे हिन्दोस्ताँ को नाज़ अहल-ए-नज़र समझते हैं उस को इमाम-ए-हिंद
- రాజ్య సౌఖ్యాలను విడిచిపెట్టి ‘వనవాసం’ సమయంలో రాముడితో పాటు అరణ్యానికి వెళ్లిన సీతా లక్ష్మణులు కూ ప్రతి ఒక్కరికీ ఎంతో స్ఫూర్తిదాయకం అని షామ్స్ చెప్పారు.
- “శ్రీ రాముడు గురించి కాకపోతే పిల్లలకు పాఠాలుగా చదువు చెప్పేందుకు ఎవరికీ అర్హత ఉంది.. సొంత తండ్రిని చెరసాలలో వేసి, సొంత అన్నలనే పొట్టనబెట్టుకున్న రాజు కథ చెప్పాలా?” అంటూ షామ్స్ మొఘల్ పాలకుడు ఔరంగజేబు పేరుని ప్రస్తావించకుండానే తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
- భారతీయ ముస్లింలు అరబ్బులు లేదా ఆఫ్ఘన్లు కాదని.. భారతదేశ సాంస్కృతిక చిహ్నాల గురించి బోధిస్తారని ఆయన అన్నారు.
- “తాము అరబ్బులు, మంగోలు లేదా ఆఫ్ఘన్లు కాదు. మేము హిందూ ముస్లింలు. కనుక మా పిల్లలకు ఉన్నత నైతిక విలువలను ఇచ్చే సాంస్కృతిక చిహ్నాల గురించి నేర్పుతాము,” అని స్పష్టం చేశారు.
- ఈ చర్యను తమ వర్గీయులు వ్యతిరేకిస్తే? తాను వేసిన అడుగులను సొంత వర్గీయులే వ్యతిరేకిస్తే అని ప్రశ్నించగా.. ప్రతిపక్షాలకు భయపడేది లేదన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..