Lok Sabha: సభలో మీ ఎంపీ ఏం చేస్తున్నాడో చూడాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..

|

Dec 22, 2021 | 9:21 AM

సమావేశాలను లైవ్​లో చూసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం యాప్‌ను తీసుకొచ్చింది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్​ ఓం బిర్లా "ఎల్​ఎస్​ మెంబర్​ యాప్"ను ప్రారంభించారు.

Lok Sabha: సభలో మీ ఎంపీ ఏం చేస్తున్నాడో చూడాలని అనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి..
Lok Sabha
Follow us on

LS Member App: మీ ప్రజా ప్రతినిధి ఏం చేస్తున్నారు..? మీ సమస్యలపై ప్రశ్నిస్తున్నారా..? ఢిల్లీలో ఏం చేస్తున్నారు..? మీ ఎంపీ లోక్‌సభలో ఏం చేస్తున్నారో చూడాలని అనుకుంటున్నారా..? లోక్​సభ సమావేశాలను లైవ్‌‌లో చూడాలని అనుకుంటున్నారా..?  ఇకపై ప్రత్యక్షంగా వీక్షించవచ్చే అవకాశం వచ్చింది. ఈ సమావేశాలను లైవ్​లో చూసేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం యాప్‌ను తీసుకొచ్చింది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఓ యాప్‌ను మంగళవారం ప్రారంభించారు. లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్​ ఓం బిర్లా “ఎల్​ఎస్​ మెంబర్​ యాప్”ను ప్రారంభించారు.

సభ్యులందరూ ఈ యాప్‌ను డౌన్​లోడ్​ చేసుకోవాలని స్పీకర్ ఓం బిర్లా సూచించారు. తమ నియోజకవర్గ ప్రజలు కూడా వినియోగించుకునేలా​ చూడాలని సూచించారు. మీ పార్లమెంట్ సభ్యుడి ప్రతి కదలికను ఇందులో చూడవచ్చన్నారు.  పార్లమెంటు సమావేశాలను యూజర్లు లైవ్​లో వీక్షించేందుకు వీలుగా ఈ యాప్​ను డిజైన్ చేశారు.

ప్రశ్నోత్తరాలు, డిబెట్లు, బులెటిన్లు సహా సభ్యుల వివరాలు కూడా తెలుసుకోవచ్చన్నారు. పార్లమెంటుకు సంబంధించిన ముఖ్య పత్రాలు, వివిధ కమిటీల రిపోర్ట్​లను చూడొచ్చని ఓం బిర్లా వెల్లడించారు. 542 మంది పార్లమెంట్‌ సభ్యుల సమాచారాన్ని కూడా అందులో పొందుపరిచారు.

స్పీకర్ మొబైల్ యాప్‌ను ప్రారంభిస్తున్నప్పుడు లఖింపూర్ ఖేరీ హింస వంటి వివిధ అంశాలపై కాంగ్రెస్, డిఎంకె, టిఎంసి సహా వివిధ ప్రతిపక్ష పార్టీల సభ్యులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ వెల్ ఆఫ్ హౌస్‌లో నిరసన తెలిపారు.

లఖింపూర్ ఖేరీ హింసాకాండలో నిందితుల్లో ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రా ఒకడు కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని ప్రతిపక్ష సభ్యులు కొందరు డిమాండ్ చేస్తుండగా, ఛత్రపతి శివాజీని అవమానించినట్లు ఆరోపించిన విషయంలో చర్య తీసుకోవాలని శివసేన డిమాండ్ చేస్తోంది.

మెడికల్, డెంటల్ కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్ పరీక్ష నుంచి తమిళనాడుకు మినహాయింపు ఇవ్వాలని డిఎంకె సభ్యులు ప్లకార్డులు పట్టుకుని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి: Phone Tapping: మళ్ళీ చర్చలో ఫోన్ ట్యాపింగ్ అంశం.. అసలు ఇదేమిట్? ప్రభుత్వం ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయగలదా?

Go Air: గో ఎయిర్ బంపర్ ఆఫర్.. వ్యాక్సిన్ వేసుకున్నవారికి 20 శాతం డిస్కౌంట్..