Cash-for-Query: జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతోన్న ‘ప్రశ్నలకు లంచం వ్యవహారం’.. రంగంలోకి పార్లమెంట్‌ ఎథిక్స్‌ కమిటీ

|

Oct 29, 2023 | 9:38 AM

Mahua Moitra on Cash-for-Query: ప్రశ్నలకు లంచం వ్యవహారం జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానికి పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలు తానే ఇచ్చినట్లు అంగీకరించారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. తాను లోక్‌సభలో అడిగే ప్రశ్నలను టైప్‌ చేయడానికి లాగిన్ వివరాలు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. దీంతో పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడానికి హీరానందాని నుంచి డబ్బులు తీసుకున్నట్లు వస్తోన్న ఆరోపణలను ఎంపీ ఖండించారు.

Cash-for-Query: జాతీయ రాజకీయాల్లో దుమారం రేపుతోన్న ‘ప్రశ్నలకు లంచం వ్యవహారం’.. రంగంలోకి పార్లమెంట్‌ ఎథిక్స్‌ కమిటీ
Mahua Moitra
Follow us on

Mahua Moitra on Cash-for-Query: ప్రశ్నలకు లంచం వ్యవహారం జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానికి పార్లమెంట్‌ లాగిన్‌ వివరాలు తానే ఇచ్చినట్లు అంగీకరించారు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. తాను లోక్‌సభలో అడిగే ప్రశ్నలను టైప్‌ చేయడానికి లాగిన్ వివరాలు ఇచ్చినట్లు ఒప్పుకున్నారు. దీంతో పార్లమెంట్‌లో ప్రశ్నలు అడగడానికి హీరానందాని నుంచి డబ్బులు తీసుకున్నట్లు వస్తోన్న ఆరోపణలను ఎంపీ ఖండించారు. ఆ ఆరోపణల్లో నిజం లేదన్నారు. దర్శన్‌ హీరానందానిని ప్రశ్నించడానికి తనకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మారుమూల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున.. ఇతరులకు కూడా ఈ వివరాలు ఇచ్చినట్లు చెప్పారు ఎంపీ. ఈవిషయంలో ఎప్పటికప్పుడు ఓటీపీ వస్తుంది. తనప్రశ్నలు ఎప్పటికప్పుడు పోస్టు అవుతుంటాయని తెలిపారు. అలాగే ప్రభుత్వం, పార్లమెంటరీ వెబ్‌సైట్లను నిర్వహించే ఎన్‌ఐసీకి దీనికి వ్యతిరేకంగా ఎలాంటి నియమాలు లేవని స్పష్టం చేశారు ఎంపీ మొయిత్రా. దర్శన్‌ తనకు ఏదైనా ఇచ్చి ఉంటే.. వాటిని నిరూపించాలని డిమాండ్ చేశారు. అఫిడవిట్‌లో తనకు 2 కోట్లు ఇచ్చినట్లు లేదు.. ఒకవేళ నగదు ఇస్తే.. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో పార్లమెంట్‌లో మహువా అడిగిన 61 ప్రశ్నల్లో 50 కేవలం అదానీ గ్రూపును లక్ష్యంగా చేసుకొన్నవే ఉన్నాయంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. ఎంపీ మొయితా పై వస్తున్న ఆరోపణలపై పార్లమెంట్‌ ఎథిక్స్‌ కమిటీ విచారణ చేపట్టింది. ఈనెల 31న హాజరుకావాలని ఎథిక్స్‌ కమిటీ మహువాకు సమన్లు జారీ చేసింది. హాజరుకావడానికి సమయం కోరడంతో నవంబర్‌ రెండుకు మార్చారు. ఎథిక్స్‌ కమిటీ విచారణలో ఏఏ విషయాలు వెలుగులోకి వస్తాయనే ఉత్కంఠ నెలకొంది.

లోక్‌సభలో వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ కోరిక మేరకు మొయిత్రా లంచాలు, ముడుపులు స్వీకరించారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే చేసిన ఆరోపణల అనంతరం దీనిపై రాజకీయాలు మొదలయ్యాయి. ఈ వ్యవహారంపై భారతీయ జనతా పార్టీ మండిపడుతోంది. అయితే, మొయిత్రా పార్టీ తృణమూల్ ఈ వివాదానికి దూరంగా ఉండగా, కాంగ్రెస్ నేతలు మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..