Lok Sabha Election: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆరో దశ పోలింగ్.. బరిలో 889 మంది అభ్యర్థులు

|

May 25, 2024 | 10:57 AM

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ చివరి అంకానికి చేరుకుంది. మొత్తం ఏడు దశల పోలింగ్‌లో ఐదు దశలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇవాళ (మే 25 శనివారం)ఆరో దశ పోలింగ్ జరుగుతోంది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం, పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Lok Sabha Election: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆరో దశ పోలింగ్.. బరిలో 889 మంది అభ్యర్థులు
Lok Sabha Polling
Follow us on

దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ చివరి అంకానికి చేరుకుంది. మొత్తం ఏడు దశల పోలింగ్‌లో ఐదు దశలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. ఇవాళ (మే 25 శనివారం)ఆరో దశ పోలింగ్ జరుగుతోంది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియ కోసం ఎన్నికల సంఘం, పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ ఆరో దశలో బీహార్‌లో 8, హర్యానాలో10, జమ్మూకశ్మీర్‌లో ఒకటి, జార్ఖండ్ 4, ఢిల్లీ 7, ఒడిశా 6, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 14, పశ్చిమ బెంగాల్‌లో 8 స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.

58 లోక్‌సభ నియోజకవర్గాలకు గానూ మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా హర్యానాలో 223 మంది, అత్యల్పంగా జమ్మూ కశ్మీర్‌లో 20 మంది పోటీ పడుతున్నారు. మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 162 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, బీహార్‌లో 86 మంది, జార్ఖండ్‌లో 93 మంది, ఒడిశాలో 64 మంది, పశ్చిమ బెంగాల్‌లో 79 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీస్క్షించుకుంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ఆరో దశలో ధర్మేంద్ర ప్రధాన్‌,, బన్సూరి స్వరాజ్, మనోజ్ తివారీ, కన్హయ్య కుమార్, మనోహర్ లాల్ ఖట్టర్, దీపేంద్ర సింగ్ హుడా వంటి కీలక అభ్యర్థులు ఉన్నారు.

ఇవాళ పోలింగ్ జరగుతున్న నియోజకవర్గాలుః

బీహార్: వాల్మీకి నగర్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్, శివహర్, వైశాలి, గోపాల్‌గంజ్, సివాన్ మరియు మహారాజ్‌గంజ్.

హర్యానా: అంబాలా, కురుక్షేత్ర, సిర్సా, హిసార్, కర్నాల్, సోనిపట్, రోహ్తక్, భివానీ-మహేంద్రగఢ్, గుర్గావ్ మరియు ఫరీదాబాద్.

జార్ఖండ్: గిరిడి, ధన్‌బాద్, రాంచీ మరియు జంషెడ్‌పూర్.

ఒడిశా: సంబల్‌పూర్, కియోంజర్, ధెంకనల్, కటక్, పూరి మరియు భువనేశ్వర్.

ఉత్తరప్రదేశ్: సుల్తాన్‌పూర్, ప్రతాప్‌గఢ్, ఫుల్‌పూర్, అలహాబాద్, అంబేద్కర్ నగర్, శ్రావస్తి, దుమారియాగంజ్, బస్తీ, సంత్ కబీర్ నగర్, లాల్‌గంజ్, అజంగఢ్, జౌన్‌పూర్, మచ్లిషహర్ మరియు భదోహి.

పశ్చిమ బెంగాల్: తమ్లుక్, కాంతి, ఘటల్, ఝర్గ్రామ్, మేదినీపూర్, పురూలియా, బంకురా మరియు బిష్ణుపూర్.

ఢిల్లీ: చాందినీ చౌక్, ఈశాన్య ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ మరియు దక్షిణ ఢిల్లీ.

జమ్మూ , కాశ్మీర్: అనంతనాగ్-రాజౌరి.

బరిలో ప్రముఖ అభ్యర్థులు వీరేః

ఆరో దశ పోలింగ్‌లో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒడిశాలోని సంబల్‌పూర్‌ నుంచి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, కర్నాల్‌ నుంచి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, ఈశాన్య ఢిల్లీ నుంచి మనోజ్‌ తివారీ, న్యూఢిల్లీ నుంచి బన్సూరి స్వరాజ్‌లు బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ అభ్యర్థులు. మరోవైపు, కాంగ్రెస్ ముఖ్య ముఖాలలో, కుమారి శైలజ హర్యానాలోని సిర్సా నుండి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. దీపేంద్ర సింగ్ హుడా హర్యానాలోని రోహ్‌తక్ నుంచి, జేపీ అగర్వాల్ ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి, కన్హయ్య కుమార్ ఈశాన్య ఢిల్లీ నుంచి పోటీ చేస్తున్నారు. న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత సోమనాథ్ భారతి కూడా ఉన్నారు.

ఇదిలావుంటే, ఆరో దశ పోలింగ్‌కు ముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. తల్లులు, సోదరీమణులు, బిడ్డలతో సహా ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి చురుకుగా పాల్గొన్నప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందన్నారు. భారత్ ప్రపంచంలోనే శక్తివంత దేశంగా తీర్చిదిద్దడానికి సహాకరించాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు.

కాగా, లోక్‌సభ ఎన్నికలు 2024 లో భాగంగా ఏప్రిల్ 19న మొదటి దశ 102 స్థానాల్లో, ఏప్రిల్ 26న రెండో దశ ఓటింగ్ 88 స్థానాల్లో, మే 7న మూడో దశ పోలింగ్ 11 రాష్ట్రాల్లోని 93 స్థానాల్లో , కేంద్రపాలిత ప్రాంతాలు, నాల్గోవ దశలో మే 13న ఐదవ దశలో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 49 స్థానాల్లో, మే 20న పోలింగ్ జరిగింది. తాజాగా మే 25న ఇవాళ ఆరోవ దశ పోలింగ్ జరుగుతోంది. ఏడవ మరియు చివరి దశ ఓటింగ్ జూన్ 1న జరగనుంది. ఇక ఫలితాలు జూన్ 4, 2024న వెలువడుతాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…