గంట ఆలస్యంగా వచ్చినందుకు ప్రెస్ మీట్‌ను రద్దు చేసిన విలేకర్లు.. కాంగ్రెస్ నేత ఆగ్రహం

|

Apr 26, 2023 | 10:10 AM

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్‌కు చుక్కెదురైంది. విలేకరుల సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు స్థానిక విలేకర్లు అతని ప్రెస్ మీటింగ్‌‌ను రద్దు చేశారు. వివరాల్లోకి వెళ్తే డీకే శివకుమార్ తన హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు రావడం వల్ల ఓ గంట ఆలస్యంగా బెంగళూరులోని ప్రెస్ మీట్‌కు వచ్చారు.

గంట ఆలస్యంగా వచ్చినందుకు ప్రెస్ మీట్‌ను రద్దు చేసిన విలేకర్లు..  కాంగ్రెస్ నేత ఆగ్రహం
Dk Shiva Kumar
Follow us on

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ కుమార్‌కు చుక్కెదురైంది. విలేకరుల సమావేశానికి ఆలస్యంగా వచ్చినందుకు స్థానిక విలేకర్లు అతని ప్రెస్ మీటింగ్‌‌ను రద్దు చేశారు. వివరాల్లోకి వెళ్తే డీకే శివకుమార్ తన హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు రావడం వల్ల ఓ గంట ఆలస్యంగా బెంగళూరులోని ప్రెస్ మీట్‌కు వచ్చారు. దీంతో విలేకర్లు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి అతని ప్రెస్ కాన్ఫరెన్స్‌‌ను కవర్ చేయకుండా రద్దు చేశారు. దీంతో శివకుమార్ విలేకర్లపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతిదీ సమయానికి జరగదంటూ చెప్పారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు ఎప్పుడు పిలవాలో, మీరు ఎప్పుడు వస్తారో తనకు తెలుసని.. బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించొద్దంటూ విలేకర్లతో అన్నారు. ఈ గందరగోళం అయిన తర్వాత ఆ విలేకర్ల పేర్లు ఇవ్వాలని.. వాళ్ల యాజమాన్యంతో మాట్లాడుతానని శివకుమార్ మీడియా కో ఆర్డినేటర్‌ను అడిగారు.

అయితే ఈ వ్యవహారంపై బీజేపీ ఐటీ సెల్ ఇంఛార్జి అమిత్ మాల్వియా స్పందించారు. శివకుమార్ ఆలస్యంగా రావడంతో ప్రెస్ మీట్‌ను బహిష్కరించిన విలేకర్లను అతను బహిరంగంగా బెదిరించాడని మండిపడ్డారు. అందరూ జర్నలిస్టులు అమ్ముడుపోయేవాళ్లు ఉండరని.. చాలామంది ధైర్యంతో, నిబద్ధతతో పనిచేసేవాళ్లు ఉన్నారని ఈ విషయాన్ని శివకుమార్ అవగాహన చేసుకోవాలంటూ నిప్పులు చెరిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..