Fast Food: ఫాస్ట్ ఫుడ్‌కు ఎక్కువగా బానిసలైన దేశాలు ఇవే.. భారత్‌కు ఏ స్థానం అంటే..?
ఒకప్పుడు అన్నం , చపాతీలు లాంటి పదార్థాలే తినేవాళ్లం. కానీ ఈ మధ్య కాలంలో ఫాస్ట్ ఫుడ్ వచ్చి మొత్తం ప్రపంచంలోనే అందరి ఆహార అలవాట్లు మార్చేసింది.

ఒకప్పుడు అన్నం , చపాతీలు లాంటి పదార్థాలే తినేవాళ్లం. కానీ ఈ మధ్య కాలంలో ఫాస్ట్ ఫుడ్ వచ్చి మొత్తం ప్రపంచంలోనే అందరి ఆహార అలవాట్లు మార్చేసింది. బయటకు వెళ్లినప్పుడు చాలామంది ఫాస్ట్ ఫుడ్ ను తినడానికే ఇష్టపడుతున్నారు. ఇప్పుడు ఎన్నో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంటులు , హోటల్స్ వచ్చేసాయి. అలాగే మనకు కావాల్సినప్పుడు ఆన్ లైన్ లో ఆర్డర్ చేసుకుంటే వెంటనే ఇంటికే నేరుగా వచ్చేస్తుంది. చాలా దేశాల్లో ఈ ఫాస్టు ఫుడ్ ను తినడం ఈ మధ్య చాలా పెరిగిపోయింది. అయితే ఎక్కవగా ఫాస్ట్ ఫుడ్ ఆహారాన్ని తినడానికి ఏ దేశాలు ఎక్కువగా బానిసలు అయ్యాయనేదానిపై ఓ నివేదిక ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్న టాప్ 20 దేశాల జాబితను బయటపెట్టింది. అందులో మొదటి స్థానంలో అమెరికా చోటుసంపాదించింది. రెండు,మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా యూకే, ఫ్రాన్స్, స్వీడన్ దేశాలు నిలిచాయి. ఆ తర్వాత ఆస్ట్రియా, మెక్సికో, సౌత్ కొరియా, గ్రీస్ లాంటి దేశాలు ఉన్నాయి. మన భారత్ 13వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈ నివేదిక వెల్లడించిన జాబితా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. చాలామంది నెటీజన్సు సెటైరికల్ గా కామెంట్లు చేస్తు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.




Most Fast Food-Obsessed Countries in the World
1.?? USA 2.?? UK 3.?? France 4.?? Sweden 5.?? Austria 6.?? Mexico 7.?? South Korea 8.?? Greece 9.?? China 10.?? Norway
12.?? Australia 13.?? India 17.?? Japan 19.?? Canada 20.?? Germany
(CEOWORLD magazine)
— World Index (@theworldindex) March 13, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..