
ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని కేదార్‌నాథ్ ధామ్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. కేదార్‌నాథ్- రుద్రప్రయాగ్ మార్గంలో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించారు.. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వీడియో ఇక్కడ చూడండి..
కేదార్‌నాథ్ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో యాత్రికులు, స్థానికుల భద్రతా కోసం రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి.
బుధవారం ఉదయం 11.20 గంటలకు కొండచరియలు విరిగిపడి, యాత్రికులు, పల్లకీ, పోర్టర్ ఆపరేటర్లను ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో అనేక మంది యాత్రికులు మరణించారు. ఈ మేరకు రుద్రప్రయాగ పోలీసు సూపరింటెండెంట్ అక్షయ్ ప్రహ్లాద్ కొండే వివరించారు. సంఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జిల్లా విపత్తు ప్రతిస్పందన దళం (DDRF) సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను రక్షించారు.
వీడియో ఇక్కడ చూడండి..
ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, ఒక మహిళతో సహా మరో ముగ్గురు గాయపడ్డారని ఎస్పీ తెలిపారు. మహిళకు స్వల్ప గాయాలు కాగా, తీవ్రంగా గాయపడిన పురుషులను గౌరికుండ్‌లోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..