రెచ్చిపోయిన మావోయిస్టులు.. భద్రతా బలగాలే లక్ష్యంగా మందుపాతరను పేలుడు.. మావోయిస్టులు.. జవాను మృతి

|

Mar 05, 2021 | 12:21 AM

భద్రతా బలగాలే టార్గెట్‌గా మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. పలు ప్రాంతాల్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ ఏజన్సీలో మావోయిస్టులు ...

రెచ్చిపోయిన మావోయిస్టులు.. భద్రతా బలగాలే లక్ష్యంగా మందుపాతరను పేలుడు.. మావోయిస్టులు.. జవాను మృతి
Follow us on

భద్రతా బలగాలే టార్గెట్‌గా మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. పలు ప్రాంతాల్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ ఏజన్సీలో మావోయిస్టులు రెచ్చిపోయారు. భద్రతా బలగాలను టార్గెట్‌ చేస్తూ అమర్చిన మందుపాతర పేలి ఓ జవాన్‌ మృతి చెందినట్లు దంతేవాడ ఎస్పీ అభిషేక్‌ పల్లవ్‌ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతేవాడ జిల్లా బర్సూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని పాహుర్‌నార్‌ సమీపంలో ఇంద్రావతి నది నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల వద్ద 22వ బెటాలియన్‌కు చెందిన జవాన్‌ లక్ష్మీకాంత్‌ ద్వివేది సెక్యూరిటీ విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం లక్ష్మీకాంత్‌ సమీపంలోని ఓ చెట్ట కింద భోజనం చేసేందుకు వెళ్లాడు. అక్కడ జవాన్‌ భోజనానికి కూర్చునేందుకు ప్రయత్నించగా, ఆ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఇంప్రోవైజ్డ్‌ ఎక్స్‌ప్లోజీవ్‌ డివైస్‌ (ఐఈడీ) భారీ విస్పోటనం చెంది ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ ఘటనలో జవాను మృతదేహం శరీర భాగాలు చెల్లాచెదురైపోయి మాంసపు ముద్దలుగా పడిపోయాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న తోటి జవాన్లు వెంటనే అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టారు. మృతి చెందిన లక్ష్మీకాంత్‌ మృతదేహాన్ని జిల్లా కేంద్రానికి తరలించారు. ఈ ఘటనతో దంతేవాడ పోలీసు యంత్రాంగం అప్రమత్తమై మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

అయితే ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం మావోయిస్టులకు అడ్డాగా మారిపోయింది. ఆ రాష్ట్రంలో అటవీ ప్రాంతంలో జరిగే ప్రభుత్వ పనులను సైతం అడ్డుకోవడం, వాహనాలను దగ్ధం చేయడం లాంటివి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. వారి కోసం భద్రతా బలగాలు ప్రతినిత్యం గాలింపు చర్యలు చేపడుతూనే ఉంటారు. పేలుడు జరగడంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో భద్రతా బలగాలు మావోయిస్టుల కోసం భారీ ఎత్తున మోహరించారు.

ఝార్ఖండ్ లో మళ్ళీ రెచ్చిపోయిన మావోయిస్టులు, మందుపాతర పేలుడులో ఇద్దరు జవాన్ల మృతి

Mandala Ramu : టీఆర్ఎస్ ఎంపీటీసీ మండలరాముపై హత్యాయత్నం, మారణాయుధాలతో దాడికి తెగబడ్డ దుండగులు