అది నిరంకుశ చర్య…..నూతన డ్రాఫ్ట్ పై లక్షద్వీప్ లో పెల్లుబికిన నిరసనలు…నిరాహార దీక్షలు

లక్షద్వీప్ డెవలప్ మెంట్ అథారిటీ రెగ్యులేషన్ (2021) పేరిట అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ తెచ్చిన డ్రాఫ్ట్ పట్ల స్థానికుల్లో తీవ్ర ఆగహం వ్యక్తమవుతోంది. ఈ ముసాయిదా నిబంధనల కారణంగా ఈ ద్వీప సంస్కృతి, సంప్రదాయాలు...

అది నిరంకుశ చర్య.....నూతన డ్రాఫ్ట్ పై లక్షద్వీప్ లో పెల్లుబికిన నిరసనలు...నిరాహార దీక్షలు
Lakshadweep Protests At Home

Edited By: Anil kumar poka

Updated on: Jun 07, 2021 | 4:31 PM

లక్షద్వీప్ డెవలప్ మెంట్ అథారిటీ రెగ్యులేషన్ (2021) పేరిట అడ్మినిస్ట్రేటర్ ప్రఫుల్ ఖోడా పటేల్ తెచ్చిన డ్రాఫ్ట్ పట్ల స్థానికుల్లో తీవ్ర ఆగహం వ్యక్తమవుతోంది. ఈ ముసాయిదా నిబంధనల కారణంగా ఈ ద్వీప సంస్కృతి, సంప్రదాయాలు మంట గలుస్తాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 12 గంటల నిరాహార దీక్ష పాటిస్తున్నవారు తమ ఇళ్ల బయట, బీచ్ లలోను, చివరకు నీటిలో కూడా ప్రొటెస్ట్ చేయడంవిశేషం. మాల్దీవుల మాదిరే మన ద్వీపం కూడా మారుతుందని, టూరిజం పెరుగతుందని ప్రఫుల్ ఖోడా చేసిన ప్రకటనను వీరు ఖండిస్తున్నారు. సంఘ వ్యతిరేక శక్తుల నిర్బంధం పేరిట తెచ్చిన రూల్స్.. ఏ వ్యక్తినైనా ఏడాది పాటు జైల్లో ఉంచడానికి వీలు కల్పిస్తున్నాయని నిరసనకారులు మండిపడుతున్నారు. పైగా ఇద్దరు పిల్లలకు మించి సంతానం గల అభ్యర్థులు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయరాదన్న నిబంధన కూడా తమకు సమ్మతం కాదని వారు అంటున్నారు. ఈ డ్రాఫ్ట్ ను పలువురు ఎంపీలు, పలు రాజకీయ పార్టీలు, చివరకు బ్యూరోక్రాట్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. నిన్న 93 మంది రిటైర్డ్ అధికారులు ప్రధాని మోదీకి లేఖ రాస్తూ ఈ నిర్ణయాలు నిరంకుశంగా ఉన్నాయని ఆరోపించారు. మరి కొందరు ఇవి అమలు కాకుండా చూడాలని హోమ్ మంత్రి అమిత్ షాను కోరారు.

అటు-ప్రఫుల్ ఖోడా పటేల్ ను రీకాల్ చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఇటీవల కేరళ అసెంబ్లీ ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. సేవ్ లక్షద్వీప్ పేరిట అక్కడ జరుగుతున్న ఆందోళనకు కేరళ ప్రభుత్వం మద్దతు ప్రకటించింది.

మరిన్ని ఇక్కడ చూడండి: ఆరు బయట నవారు మంచం మీద పిల్లలతో అలా బన్నీ హాయి ని అనుభవిస్తున్న అల్లు అర్జున్ : Allu Arjun Video viral.

ఆకు అంచున అద్భుతమైన పక్షిగూడు..నేచర్ టాలెంట్ కి ఫిదా అవుతున్న నెటిజెన్లు :Bird nest inside leaf viral video.

Shocking Video: తప్పిన పెను ప్రమాదం.. అతనే గనుక అలర్ట్‌గా లేకుంటే పరిస్థితి ఎలా ఉండేదో..వైరల్ అవుతున్న వీడియో.

డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో పేస్ బుక్ ఖాతాపై రెండేళ్ల నిషేధం.2023 వరకు సస్పెండ్ – face book.:Facebook suspends Trump Video.