No Bridge No Marraige : ఆ గ్రామంలో యువతని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపని చుట్టుపక్కల గ్రామస్థులు ఎందుకంటే..!

త కొంతకాలంగా యువతీ యువకుల పెళ్లి వయసు మారిపోయింది.. ఇప్పటికే చాలా మందికి పెళ్లిళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయని అది మంచిది కాదంటూ నిపుణులు గోల పెడుతున్నారు.. అయితే ఓ గ్రామంలో యువతకు పెళ్లి కలగానే మిలిపోతుందని...

No Bridge No Marraige : ఆ గ్రామంలో యువతని పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపని చుట్టుపక్కల గ్రామస్థులు ఎందుకంటే..!

Updated on: Feb 21, 2021 | 12:49 PM

No Bridge No Marraige :  గత కొంతకాలంగా యువతీ యువకుల పెళ్లి వయసు మారిపోయింది.. ఇప్పటికే చాలా మందికి పెళ్లిళ్లు ఆలస్యంగా జరుగుతున్నాయని అది మంచిది కాదంటూ నిపుణులు గోల పెడుతున్నారు.. అయితే ఓ గ్రామంలో యువతకు పెళ్లి కలగానే మిలిపోతుందని గ్రామస్థులు బాధపడుతున్నారు. ఐతే అలా గ్రామంలో యువకులకు పెళ్లి కాకపోవడానికి కారణం అనారోగ్యం కాదు ఆర్ధిక సమస్యలు కావు.. రవాణా సమస్య.. ఇదేంటి రాకపోకలకు సరిగ్గా వీలు లేదంటూ ఆ ఊరులో ఉన్నవారితో ఎవరూ సంబంధం కలుపుకోవడం లేదు.. ఈ గ్రామం బీహార్ లో ఉంది.

బీహార్ , పశ్చిమబెంగాల్, బిహార్‌ సరిహద్దుల్లో ఉన్న గ్రామం తారాబడి. ఈ గ్రామంలో దాదాపు 800 మంది వరకు ముస్లిం జనాభా ఉంది. అయితే ఊరు చుట్టూ నదులే. బీహార్ లోని అన్ని ప్రాంతాల్లో కనీస సదుపాయాలను ఏర్పాటు చేస్తామని సీఎం నితీష్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే ఈ గ్రామం అందుకు నోచుకోలేదు.. దీంతో ఆ గ్రామంలోని యువతను పెళ్లి చేసుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల వారు అంతగా ఇష్టపడడం లేదు.

అంతేకాదు ఏ అవసరం వచ్చినా కనీసం తమ చుట్టాల ఇంటికి వెళ్ళడానికి కూడా ఉండడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులూ ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని.. తమ గ్రామానికి కనీసం ఒక వంతెన కూడా నిర్మించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు యువత. తమ గ్రామానికి కనీస సదుపాయాలు కల్పించాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

Also Read:

సముద్ర ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింతజీవి.. మొసలి తల..చేప శరీరం.. వైరల్‌ అవుతున్న ఫోటోలు

 పండు తిన్నదని ఆవును కత్తితో పొడిచి చంపిన వ్యాపారి.. కోపంలో ఆ పనిచేశానంటూ పశ్చాతాపం