శ్రద్ధా వాకర్ హత్యతరహాలో కేరళలో మరో దారుణ ఘటన జరిగింది. ఓ హోటల్ యజమానిని ఒక అబ్బాయి, అమ్మాయి కలిసి అత్యంత కిరాతకంగా చంపేశారు.. ఆపై మృతదేహాన్ని ముక్కలుగా నరికి ట్రాలీ బ్యాగ్‌లో తీసుకొని వెళ్లి అటవీ ప్రాంతంలో విసిరేశారు. కోజీకోడ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఒలవన్నాలో సిద్ధిఖ్ (58) అనే హోటల్ యజమానిని ఇంత దారుణంగా హత్య చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. సీన్‌లో పోలీసులు ఎంట్రీ ఇవ్వగానే హోటల్ నుంచి నిందితులు హోటల్ నుంచి పరాయ్యారు. వారు హోటల్ లో పనిచేసే సిబ్బంది శిబిలి (22), ఫర్హానా (18)గా గుర్తించారు. వారిద్దరూ అనుమానం రాకుండా చెన్నై చేరుకోగా.. కేరళ పోలీసుల సమాచారంతో చెన్నై పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కేరళ పోలీసులకు అప్పగించారు.
వారిద్దరూ హత్య చేసిన తర్వాత సిద్ధిఖ్ ను ముక్కలు ముక్కలుగా నరికారు. అనంతరం మృతదేహం శరీర భాగాలను ఓ సూట్ కేస్ లో వేసి.. అట్టపాడి పాస్వద్ద పడేశారని పోలీసులు తెలిపారు. ఆ సూట్ కేసును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. హోటల్‌లోనూ కొన్ని సిద్ధిఖ్ శరీర భాగాలను గుర్తించినట్లు పేర్కొంటున్నారు. అనంతరం శరీర భాగాలను పోలీసులు పోస్ట్‌మార్టం కోసం కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
హత్య జరిగిన సమయంలో హోటల్ గదిలోనే ఉన్నట్లు అనుమానిస్తున్న పాలక్కడ్‌కు చెందిన మరో వ్యక్తిను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, హోటల్ ఓనర్ సిద్ధిఖ్‌కు, హోటల్ సిబ్బంది శిబిల్, ఫర్హానాకు మధ్య కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు అన్వేషిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..