Gold Mask: దుర్గ పూజ కోసం బంగారు మాస్క్ చేయించుకున్న ఓ వ్యాపారి.. ధర తెలిస్తే షాక్..

|

Nov 13, 2021 | 8:14 PM

Corona Virus-Gold Mask: కరోనా వైరాస్ నివారణలో భాగంగా తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి వస్తుంది.  మాస్కులు జీవితంలో ఒక భాగమయ్యాయి. పంక్షన్ లేదు.. ఏ సందర్భం వచ్చినా..

Gold Mask: దుర్గ పూజ కోసం బంగారు మాస్క్ చేయించుకున్న ఓ వ్యాపారి.. ధర తెలిస్తే షాక్..
West Bengal Businessman
Follow us on

Corona Virus-Gold Mask: కరోనా వైరాస్ నివారణలో భాగంగా తప్పనిసరిగా మాస్కులు ధరించాల్సి వస్తుంది.  మాస్కులు జీవితంలో ఒక భాగమయ్యాయి. పంక్షన్ లేదు.. ఏ సందర్భం వచ్చినా మాస్కులు ధరించాల్సి రావడంతో.. చాలామంది తమ సృజనాత్మకతకు పదును పెట్టారు. ఎంబ్రాయిడరీ మాస్కులు, ఫొటో ఫ్రింట్‌ మాస్కుల ఇలా రకరకాల మాస్కులు తయారు చేస్తూనే ఉన్నారు. అయితే కొంతమంది ఒక్క అడుగు వేసి.. బంగారం, వజ్రాలతో పొదిగిన మాస్కులు కూడా తయారు చేయించుకుని ధరిస్తూ.. తమ దర్జాని, దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యాపారవేత్త బంగారంలో మాస్క్ తయారు చేయించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే..

పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ వ్యాపారవేత్త 108 గ్రాముల బంగారంతో రూ. 5 లక్షల 70 వేల ఖరీదు చేసే గోల్డ్‌ మాస్క్‌ చేయించుకున్నాడు. ఈమాస్క్ ను చందన్‌ దాస్‌ అనే జ్యువెలరీ డిజైనర్‌తో 15 రోజుల్లో ప్రత్యేకంగా తయారు చేయించారు.  ఇటీవల జరిగిన దుర్గ పూజ వేడుకల సందర్భంగా కోల్ కతాకు చెందిన ఓ వ్యాపార వేత్త తన డబ్బుని ప్రదర్శించాలని అనుకుని… ఇష్టపడి బంగారంతో మాస్కుని తయారు చేయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ గోల్డ్ మాస్క్ ని ధరించడంతో వ్యాపారవేత్తని చూడడానికి జనం భారీ చేరుకోవడంతో.. వెంటనే ఈ మాస్క్ ను తీసి దాచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మాస్క్ కు చెందిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read:

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో టీటీడీకి చోటు.. మీ సేవలు గొప్పవంటూ మహిళా భక్తురాలు ఈ మెయిల్‌..

మహారాష్ట్ర గడ్చిరోలిలో భారీ ఎన్‌కౌంటర్‌.. 26 మంది మావోయిస్టుల మృతి.. ముగ్గురు జవాన్లకు గాయాలు