AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఛీ.. ఛీ.. ఎంతకు తెగించావ్‌రా.. ఆలస్యం అవుతుందని బైక్ రైడ్ క్యాన్సిల్ చేసిన మహిళా డాక్టర్‌.. ఆ తర్వాత..

ఎన్ని చట్టాలున్నా.. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మహిళలపై వేధింపులు ఆగడం లేదు.. తాజాగా.. ఓ మహిళా డాక్టర్ బైక్ రైడ్ ను క్యాన్సిల్ చేసినందుకు.. బైకర్ ఆమెపై వేధింపులకు దిగాడు.. ఫోన్ల మీద ఫోన్లు చేయడంతోపాటు.. ఆమెకు అసభ్యకరమైన వీడియోలను పంపాడు..

ఛీ.. ఛీ.. ఎంతకు తెగించావ్‌రా.. ఆలస్యం అవుతుందని బైక్ రైడ్ క్యాన్సిల్ చేసిన మహిళా డాక్టర్‌.. ఆ తర్వాత..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Nov 03, 2024 | 7:18 AM

Share

ఆమె ఓ డాక్టర్.. ఇంటికి వెళ్లేందుకు యాప్ లో బైక్ రైడ్ ను బుక్ చేసుకుంది.. ఎంత సేపు ఎదురు చూసినా బైకర్ రాలేదు.. దీంతో ఏం చేయాలో అర్థం కాక బైక్ రైడ్ బుకింగ్‌ను క్యాన్సల్ చేసుకుంది.. దీంతో బైక్‌ రైడ్‌ బుకింగ్‌ను రద్దు చేసినందుకు.. బైకర్ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలికి 17 సార్లు ఫోన్‌ కాల్‌ చేయడమే కాకుండా, అసభ్య వీడియోలును పంపించి వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.. ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా నగరంలో చోటుచేసుకుంది.

కోల్‌కతా జాదవ్‌పూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ ఇంటికి వెళ్లేందుకు యాప్‌లో శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బైక్‌ రైడ్‌ ను బుకింగ్‌ చేసింది.. అయితే బైక్‌ రావడానికి ఆలస్యమవుతుండడంతో ఆమె రైడ్‌ను రద్దు చేసుకుంది.. దీంతో సదరు బైక్‌ రైడర్‌ రెచ్చిపోయాడు.. 17 సార్లు ఆమెకు ఫోన్‌ చేశాడు. అంతేకాకుండా ఆమె వాట్సప్‌ నంబర్‌కు అశ్లీల వీడియోలు పంపాడు.. అంతేకాకుండా తీవ్రపరిణామాలుంటాయంటూ ఆమెపై బెదిరింపులకు దిగాడు.

దీంతో భయాందోళనకు గురైన మహిళా డాక్టర్‌ వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ముందుగా పోలీస్‌ కమిషనర్‌కు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసింది.. అనంతరం నేరుగా పుర్బా జాదవ్‌పుర్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి మహిళ ఫిర్యాదు చేసింది.. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే నిందితుడిని పట్టుకున్నారు. అతడిపై భారతీయ న్యాయ సంహిత చట్టం కింద పలు సెక్షన్‌లతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..