దేశ రాజకీయాల్లో సంచలనం.. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత, కేజ్రీవాల్‌తోపాటు ఎంతమంది అరెస్టు అయ్యారంటే..

ఢిల్లీ లిక్కర్​ పాలసీ కేస్​.. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది హాట్​ టాపిక్​గా మారింది.. ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ అరెస్ట్​తో దేశ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి.. అంతేకాదు.. వారం రోజుల వ్యవధిలో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ని ఈడీ అరెస్ట్​ చేయడం ఈ కేసు తీవ్రతకు అద్దం పడుతోంది.

దేశ రాజకీయాల్లో సంచలనం.. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత, కేజ్రీవాల్‌తోపాటు ఎంతమంది అరెస్టు అయ్యారంటే..
Delhi Liquor Policy Case

Updated on: Mar 22, 2024 | 10:52 AM

ఢిల్లీ లిక్కర్​ పాలసీ కేస్​.. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇది హాట్​ టాపిక్​గా మారింది.. ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​ అరెస్ట్​తో దేశ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి.. అంతేకాదు.. వారం రోజుల వ్యవధిలో బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్​ని ఈడీ అరెస్ట్​ చేయడం ఈ కేసు తీవ్రతకు అద్దం పడుతోంది. అయితే ఈ పరిణామాలు సరిగ్గా లోక్​సభ ఎన్నికలకు ముందు జరుగుతుండటంతో సర్వత్రా చర్చలకు దారితీసింది. ఫలితంగా..ఢిల్లీ లిక్కర్​ కేసు వ్యవహారంపై అందరి ఫోకస్​ పడింది.. ఆరోపణలు.. ప్రతి ఆరోపణల మద్య రాజకీయాలు మరింత వేడెక్కాయి.

ఈ కేసులో ఇప్పటికే నలుగురు కీలక నేతలు అరెస్ట్​ అయ్యారు.. వారు.. ఢిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా, ఎమ్మెల్సీ కవిత, ఆమ్​ ఆద్మీ ఎంపీ సంజయ్​ సింగ్​ అరెస్ట్‌ అయ్యారు. ఈ‌ కేసులో ఇప్పటివరకు జరిగిన అరెస్టులను ఒక్కసారి చూడండి..

  • 2022 సెప్టెంబర్‌ 28న ఇండో స్పిరిట్స్‌ యజమాని సమీర్‌ మహేంద్రు అరెస్ట్‌..
  • 2022 నవంబర్‌ 10న శరత్‌చంద్రారెడ్డి , బినోయ్‌బాబు
  • 2022 నవంబర్‌ 14న అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌
  • 2022 నవంబర్‌ 30న బడ్డీ రిటైల్‌ డైరెక్టర్‌ అమిత్‌ అరోరా
  • 2023 ఫిబ్రవరి 7న మద్యం వ్యాపారి గౌతం మల్హోత్రా
  • 2023 ఫిబ్రవరి 8న రాజేశ్‌ జోషి
  • 2023 ఫిబ్రవరి 9న కవిత మాజీ ఆడిటర్‌ గోరంట్ల బుచ్చిబాబు
  • 2023 ఫిబ్రవరి 10న మద్యం వ్యాపారి మాగుంట రాఘవ
  • 2023 మార్చి 1న అమ్‌ ధల్‌, మార్చి 6న అరుణ్‌ పిళ్ళై
  • 2023 మార్చి 9న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా
  • 2023 అక్టోబర్‌ 4న ఆమ్​ ఆద్మీ ఎంపీ సంజయ్​ సింగ్
  • 2024 మార్చి 15న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
  • 2024 మార్చి 21న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్ట్ అయ్యారు..

ఇలా అరెస్టులతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.. కావాలనే కేంద్రం అరెస్టులు జరిపిస్తుందని విపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి. కాగా. ఈ ఢిల్లీ లిక్కర్​ కేసు ఇంకెన్ని మలుపులు తిరిగుతుందో! ఇంకెంతమంది పేర్లు బయటకి వస్తాయో! జైలుకు వెళ్లిన వారు ఎప్పుడు బయటకి వస్తారో! వంటి విషయాలకు ఇప్పుడు హాట్‌ టాఫిక్‌గా మారాయి..ఫలితంగా..ఢిల్లీ లిక్కర్​ కేసు వ్యవహారంపై అందరి ఫోకస్​ పడింది..

మరోవైపు ఇవాళ కవిత క్వాష్ పిటీషన్, కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటీషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే, కోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్నారు. రేపటి వరకూ కస్టడీ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో లోతైన దర్యాప్తు జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఇవాళ కోర్టు ఏం చెప్తుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.