Black Taj Mahal: బ్లాక్ తాజ్‌మహల్ భారతదేశంలో ఎక్కడ ఉందో తెలుసా..? ఎన్నో ఆసక్తికర విషయాలు

|

Aug 22, 2022 | 7:32 PM

Black Taj Mahal: భారతదేశంలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వీటి గుర్తింపు దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఉంది. వీటిలో ఒకటి తాజ్ మహల్. దాని అందం..

Black Taj Mahal: బ్లాక్ తాజ్‌మహల్ భారతదేశంలో ఎక్కడ ఉందో తెలుసా..? ఎన్నో ఆసక్తికర విషయాలు
Black Taj Mahal
Follow us on

Black Taj Mahal: భారతదేశంలో అనేక చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వీటి గుర్తింపు దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఉంది. వీటిలో ఒకటి తాజ్ మహల్. దాని అందం, అద్భుతమైన వాస్తుశిల్పం కోసం ప్రపంచంలోనే అద్భుతంగా పేరుగాంచింది. నివేదికల ప్రకారం.. షాజహాన్ చక్రవర్తి కంటే ముందు ఒక మొఘల్ పాలకుడు భారతదేశంలో తాజ్ మహల్ వంటి చారిత్రక భవనాన్ని నిర్మించాడు. కాలక్రమేణా ఈ భవనం పాతదిగా మారి దాని రంగు నల్లగా మారింది. భారతదేశంలో ఉన్న ఈ స్మారకాన్ని బ్లాక్‌ తాజ్ మహల్‌గా పిలుస్తారు. ఇది ఎక్కడ ఉంది..? దానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు ఏమిటో తెలుసుకుందాం.

బ్లాక్ తాజ్ మహల్ ఈ రాష్ట్రంలో ఉంది:

బ్లాక్ తాజ్ మహల్ అని పిలువబడే ఈ భవనం భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బుర్హాన్‌పూర్‌లో ఉంది. చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ ప్రేమతో ఏర్పాటు చేసిన పాలరాతి కిరీటం బుర్హాన్‌పూర్‌లోని ఈ భవనాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. అయితే, వర్షంలో ఉన్న మట్టి, పక్షులు సంచారం, దూళి కారణంగా అది నల్లగా మారింది.

ఇవి కూడా చదవండి

అయితే చాలా కాలంగా నిర్వహణ లేక పరిశుభ్రత లేకపోవడంతో ఈ భవనం నల్లగా మారింది. పురావస్తు శాఖ దీనిని శుభ్రపరిచే బాధ్యతను తీసుకుని రసాయనాలతో శుభ్రం చేయడం ప్రారంభించింది. ఈ దీర్ఘకాల శుభ్రత తర్వాత ఇప్పుడు ఈ భవనం నలుపు నుండి గోధుమ రంగులో కనిపించడం ప్రారంభించింది. దాని రంగు మెరుగుపడిన తర్వాత దీనిని చూడటానికి పర్యాటకులు కూడా రావడం ప్రారంభించారు. ఒకప్పుడు ఈ ప్రదేశం శిథిలావస్థకు చేరుకుంది.

ఇది అతని సమాధిగా..

ఇది షానవాజ్ ఖాన్ కోసం నిర్మించిన సమాధి. ఇది బుర్హాన్‌పూర్ నవాబ్ అబ్దుల్ రహీం ఖాన్‌ఖానా కుమారుడు షానవాజ్ ఖాన్ కోసం నిర్మించబడింది. దీని నిర్మాణం 1622 సంవత్సరంలో ప్రారంభమైంది. మీరు మధ్యప్రదేశ్‌ను సందర్శించబోతున్నట్లయితే బ్లాక్ తాజ్ మహల్ తప్పకుండా చూడండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి