
ఆపరేషన్ సింధూర్‌లో బ్రహ్మోస్ పవర్ ఏంటో తెలిశాక.. ‘మేమిచ్చిన F-16 యుద్ధ విమానాలను అర్జెంట్‌గా ఎక్కడైనా దాచేయ్’ అని పాక్‌ను అలర్ట్ చేసింది అమెరికా. INS విక్రాంత్ అరేబియా సంద్రంలో అడుగుపెట్టిందని తెలియగానే.. చైనా, తుర్కియే ఇచ్చిన వార్‌షిప్స్‌ను గ్వాదర్ పోర్టులో దాచేశారు. పాక్ దగ్గరున్న అమెరికా వార్ షిప్పులను సివిల్ పోర్టులో ఎవరికీ కనిపించకుండా కవర్ చేశారు. కరాచీ నేవీ బేస్ నుంచి ఒక్కరు కూడా బయటకు రాలేకపోయారు ఆపరేషన్ సింధూర్ టైమ్‌లో. దటీజ్.. ఇండియన్ నేవీ పవర్. ఇండియన్ నేవీ అనే పేరెత్తగానే గజగజ వణికిపోతుంటుంది పాక్. అలాంటిది.. మరో రెండు వార్‌షిప్స్ రంగంలోకి దిగుతున్నాయ్. అది కూడా విశాఖ సముద్రతీరం నుంచి. వాటిని చూస్తే కాదు.. వాటి గురించి విన్నా చాలు పాక్ షేక్ అవ్వాల్సిందే. చైనా ఆయుధ సంపత్తి అంత ఇంత అని మాట్లాడుతుంటారు గానీ.. చాలావరకు రష్యా ఆయుధాలనే రివర్స్ ఇంజనీరింగ్ చేసి తయారుచేసుకుంది చైనా. చైనా తయారుచేసిన ఆయుధాలు బీభత్సం సృష్టించాయి అని ఇప్పటి వరకు ఎక్కడా ప్రూవ్ కాలేదు కూడా. అలాంటి ఆయుధాలను అరువుకు తెచ్చుకుని వాడుతోంది పాకిస్తాన్. ఇక యూకే, ఫ్రాన్స్ దగ్గర అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెపన్స్ ఉన్నాయ్. బట్.. కొంత టెక్నాలజీని అమెరికా నుంచి అరువు తెచ్చుకున్నాయి ఆ దేశాలు. ఇక పాకిస్తాన్‌కైతే.. సొంతంగా చిన్న మిస్సైల్‌ను కూడా తయారుచేయడం చేతకాదు. బట్.. భారత్ అలా కాదు. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో...