Minister Kishan Reddy: నా హక్కులకు భంగం కలిగించారు.. రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ..

|

Jul 20, 2023 | 7:03 PM

బీజేపీ ఇచ్చిన ఛలో బాటసింగారం పిలుపుతో... పొలిటికల్‌హీట్‌ పీక్స్‌కు చేరుకుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర పార్టీబాధ్యతలు చేపట్టాక తలపెట్టిన తొలి కార్యక్రమం.. గరంగరం అన్నట్టుగా సాగింది.

Minister Kishan Reddy: నా హక్కులకు భంగం కలిగించారు.. రాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ..
Kishan Reddy
Follow us on

హైదరాబాద్, జూలై 20: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో వాతావరణం చల్లగా మారిపోతే… తెలంగాణలో మాత్రం రాజకీయం వేడెక్కింది. డబుల్‌ బెడ్రూం ఇళ్ళ పరిశీలనకోసం బీజేపీ ఇచ్చిన ఛలో బాటసింగారం పిలుపుతో… పొలిటికల్‌హీట్‌ పీక్స్‌కు చేరుకుంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్ర పార్టీబాధ్యతలు చేపట్టాక తలపెట్టిన తొలి కార్యక్రమం.. గరంగరం అన్నట్టుగా సాగింది. తెలంగాణ ప్రభుత్వం దుందుడుకు చర్యపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో పేద ప్రజలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్లకు పైగా గృహాలను నిర్మించిందని.. ఇందులో భాగంగా.. హైదరాబాద్ శివారు బాటసింగారంలో ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సముదాయాలను పరిశీలించేందుకు వెళ్తున్న తనను అడ్డుకోవడమే కాకుండా అరెస్ట్ చేసేందుకు రాచకొండ పోలీసులు ప్రయత్నించారని లేఖలో పేర్కొన్నారు.

తాము ఆందోళనలు చేసేందుకు, ధర్నా చేసేందుకు కాదని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌, ఇతర పోలీసు సిబ్బందికి వివరించినా.. నిర్ద్వందంగా అరెస్టు చేస్తామన్నారని పేర్కొన్నారు. నా టూర్ ప్రోగ్రామ్ కాపీలో కూడా ఇది స్పష్టం చేశానన్నారు. ఆ వివరాలను తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌కు కూడా పంపాను. ఈ వివరాలను అందించినప్పటికీ చలో బాటసింగారం పిలుపు నేపథ్యంలో నన్ను శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని ఓఆర్‌ఆర్‌పై అదుపులోకి తీసుకున్నారు.

‘Z కేటగిరీ సెక్యూరిటీ’ హోల్డర్‌నైన నాపై ఎలివేటెడ్ బెదిరింపులకు తెలంగాణ పోలీసులు దిగారని.. తెలంగాణ పోలీసుల ఈ చర్యను లోక్‌సభలో విధివిధానాలు, ప్రవర్తనా నియమావళిలోని రూల్ నెం. 229 ప్రకారం ప్రత్యేక హక్కును ఉల్లంఘించినట్లు నేను పరిగణిస్తాను.

పోలీసులు అరెస్టు చేయడం. చలో బాటసింగారం పిలుపు నేపథ్యంలో ఆయన్న శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని ఓఆర్‌ఆర్‌పై అదుపులోకి తీసుకున్నారు. కిషన్ రెడ్డితో పాటు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు, రామంచంద్రా రెడ్డి తదితరులను అరెస్టు చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రజాసమస్యలను గుర్తించడంలో భాగంగా హైదరాబాద్ శివారు బాటసింగారంలో ఎనిమిదేళ్లుగా అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల సముదాయాలను పరిశీలించేందుకు బీజేపీ నేతలు ఇవాళ పిలుపునిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం