Vismaya death case: వరకట్న వేధింపులకు మరో యువతి బలి.. కన్నీరు పెట్టిస్తున్న కేరళ విస్మయ ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు..

వరకట్న వేధింపులకు మరో యువతి బలైంది. కేరళ రాష్ట్రంలోని ఆయుర్వేద డాక్టర్‍ను అదనపు కట్నం కోసం ఆమె భర్త, అత్తమామలు చిత్రహింసలకు గురిచేసి చంపారు.

Vismaya death case: వరకట్న వేధింపులకు మరో యువతి బలి.. కన్నీరు పెట్టిస్తున్న కేరళ విస్మయ ఘటన.. పోలీసుల అదుపులో నిందితుడు..
Vismaya

Updated on: Jun 23, 2021 | 1:30 PM

వరకట్న వేధింపులకు మరో యువతి బలైంది. కేరళ రాష్ట్రంలోని ఆయుర్వేద డాక్టర్‍ను అదనపు కట్నం కోసం ఆమె భర్త, అత్తమామలు చిత్రహింసలకు గురిచేసి చంపారు. ఈనెల 21న సోమవారం కేరళలోని కడక్కల్‏లోని కైతోడ్ కు చెందిన ఎస్.వి. విస్మయ (23) అనే ఆయుర్వేద డాక్టర్ ఉదయం బాత్ రూంలో ఉరేసుకుని కనిపించింది. అయితే విస్మయ ఆత్మహత్య చేసుకుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆమె తన అన్నకు పంపించిన మెసేజ్‏లు, ఫోటోలు బయటకు రావడంతో అసలు విషయం బయటపడింది. అందులో ఆమె మొహం, చేతులపై గాయాలున్నాయి. దీంతో తమ కూతురిని భర్త అత్తమామలే చిత్రహింసలు పెట్టి చంపేశారంటూ విస్మయ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం పోలీసులు విస్మయ భర్తను అదుపులోకి తీసుకున్నారు.

Vismaya 1

వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని కొల్లాం జిల్లా సస్తంకొట్ట ప్రాంతానికి చెందిన ఎస్ కిరణ్ కు… విస్మయ వి నాయర్ (23) అనే ఆయుర్వేద డాక్టర్ కు మార్చి 2020లో పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. అల్లుడు ఆర్టీఏలో ఇన్‏స్పెక్టర్ గా పనిచేస్తుండడంతో ఆమె తల్లితండ్రులు కట్నం కింద 100 సవర్ల బంగారం, ఎకరానికి పైగా భూమి, కారును కట్నంగా అందించారు. కానీ పెళ్లైన కొద్ది రోజులకే విస్మయకు అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. కారుకు బదులుగా డబ్బులు కావాలని భర్త, అత్తమామలు విస్మయను చిత్రహింసలు పెట్టేవారు. తనను తన భర్త, అత్తమామలు రోజూ చిత్రహింసలు పెడుతున్నారని తన తల్లికి చెప్పుకునేది విస్మయ. ఆ తర్వాత కొద్ది రోజులకు తన కజిన్ కు తనను భర్త కొడుతున్నాడంటూ మెసేజ్ చేసింది. తనను జుట్టు పట్టుకుని ఈడ్చి ముఖంపై కొట్టాడని గాయాలను చూపిస్తూ ఫొటోలు పంపింది. తనను కిరణ్ కొట్టిన విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని తాను కూడా ఎవరికీ చెప్పలేదని ఆ మెసేజ్‌ల్లో విస్మయ తెలిపింది’అని తెలిపారు. ఈ ఘటన జరిగిన రెండు రోజులకే విస్మయ ఆత్మహత్య చేసుకుంది. దీంతో తమ కూతురుని భర్త అత్తింటి వారే చంపారని విస్మయ కుటుంబ సభ్యులు ఆగ్రహాం వ్యక్తం చేశారు.

Kerala

ఇక ఈ ఆరోపణలు ఎదుర్కోంటున్న విస్మయ భర్తపై ఐపీసీ సెక్షన్ 304 బీ కింద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రాష్ట్ర రవాణా శాఖ సర్వీస్ నుంచి కిరణ్ ను సస్పెండ్ చేశారు. అటు విస్మయ ఘటన కేరళ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విస్మయ అత్తింటివారిని శిక్షించాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై కేరళలోని అనేక మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కుందనపు బొమ్మ లాంటి అమ్మాయిని కట్నం కోసం పొట్టన పెట్టుకున్న కిరాతకులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: Priyanka Chopra: ‘బాలీవుడ్‌లో వారిదే ఆధిపత్యం’.. బీటౌన్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన గ్లోబల్ స్టార్..