నలుగురు కర్ణాటక పోలీసులను అరెస్ట్‌ చేసిన కేరళ పోలీసులు.. కారణం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!

|

Aug 04, 2023 | 11:29 AM

అయితే, అడిగిన మేరకు డబ్బులు చెల్లించినా తర్వాత కూడా వారిని విడుదల చేసేందుకు కర్ణాటక పోలీసులు నిరాకరించారు. దాంతో సదరు యువకుల కుటుంబీకులు కేరళ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేరళ పోలీసులు కర్ణాటక పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద లభించిన రూ.3.95 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకున్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు.

నలుగురు కర్ణాటక పోలీసులను అరెస్ట్‌ చేసిన కేరళ పోలీసులు.. కారణం తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే..!
Karnataka Cops
Follow us on

క్రిప్టోకరెన్సీ కేసు దర్యాప్తులో లంచం తీసుకున్న ఆరోపణలపై సీఈఎన్ (సైబర్, ఎకనామిక్ అఫెన్సెస్, అండ్ నార్కోటిక్స్) ఇన్‌స్పెక్టర్ సహా నలుగురు కర్ణాటక పోలీసు అధికారులను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. CEN పోలీస్ ఇన్‌స్పెక్టర్ శివప్రకాష్, అతని ముగ్గురు సహచరులను కలమసేరి పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.  కర్ణాటకలో నమోదైన ఒక చీటింగ్‌ కేసులో అనుమానితులను అరెస్ట్‌ చేసేందుకు కొచ్చికి వెళ్లారు కర్ణాటక పోలీసులు. అయితే, అక్కడ వారిని కేరళ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒక ఇన్‌స్పెక్టర్‌తో సహా నలుగురు కర్ణాటక పోలీసు సిబ్బందిని కేరళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే..కేరళ వచ్చిన కర్ణాటక పోలీసులు ఇద్దరు నిందితులను పట్టుకున్న తర్వాత వారిని విడిపించడానికి డబ్బు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు రావటంతో వారిని అరెస్ట్‌ చేశారు. విషయం ఏంటంటే.. బెంగళూరుకు చెందిన చందక శ్రీకాంత్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సైబర్ మోసానికి పాల్పడినట్లు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

కర్ణాటకలో ఆన్‌లైన్ క్రిప్టోకరెన్సీ చీటింగ్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. మోసానికి సంబంధించిన కేసులో అనుమానితులు కేరళలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఆగస్ట్‌ 1న కర్ణాటకకు చెందిన సీఐతో సహా నలుగురు పోలీసులు కేరళలోని కొచ్చీకి చేరుకున్నారు. బెంగళూరుకు చెందిన చందక శ్రీకాంత్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సైబర్ మోసానికి(క్రిప్టోకరెన్సీ మోసం) పాల్పడినట్లు వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారిస్తున్న వైట్‌ఫీల్డ్ సీఈఎన్ పోలీసులు.. క్రిప్టోకరెన్సీ మోసం కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని విడిచిపెట్టేందుకు రూ.25 లక్షలు డిమాండ్‌ చేసినట్టుగా తెలిసింది.. ఈ నేపథ్యంలో పట్టుబడిన నిందితుల్లో ఒకరు లక్ష, మరో నిందితుడు రూ.2.95 లక్షల డబ్బును కర్ణాటక పోలీసులకు ముట్టజెప్పారు.

అయితే, అడిగిన మేరకు డబ్బులు చెల్లించినా తర్వాత కూడా వారిని విడుదల చేసేందుకు కర్ణాటక పోలీసులు నిరాకరించారు. దాంతో సదరు యువకుల కుటుంబీకులు కేరళ పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కేరళ పోలీసులు కర్ణాటక పోలీసులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద లభించిన రూ.3.95 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. లంచం తీసుకున్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అదుపులోకి తీసుకున్న కర్ణాటక పోలీసులపై కేసు నమోదు చేశామని, ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోందని, ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు కర్ణాటక పోలీసు సీనియర్ అధికారి కొచ్చికి వచ్చారని కేరళ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ విషయాన్ని పరిశీలించడానికి కర్ణాటక పోలీసు నుండి సీనియర్ అధికారి కొచ్చికి చేరుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..