AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్య హత్య కేసులో జీవిత ఖైదు – అనాథలుగా మిగిలిన చిన్నారులు

భార్యపై అనుమానంతో కేరళకు చెందిన ఓ వ్యక్తి పట్టపగలే ఆమెను కిరాతకంగా చంపేశాడు. ఆమెను చంపేందుకు కేరళ నుంచి దుబాయ్ వెళ్లి ఆమెను కిరాతకంగా మట్టుపెట్టాడు....

భార్య హత్య కేసులో జీవిత ఖైదు – అనాథలుగా మిగిలిన చిన్నారులు
Jyothi Gadda
|

Updated on: Jul 28, 2020 | 6:28 PM

Share

భార్యపై అనుమానంతో కేరళకు చెందిన ఓ వ్యక్తి పట్టపగలే ఆమెను కిరాతకంగా చంపేశాడు. ఆమెను చంపేందుకు కేరళ నుంచి దుబాయ్ వెళ్లి ఆమెను కిరాతకంగా మట్టుపెట్టాడు. ఈ కేసులో దుబాయ్ కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. పూర్తి వివ‌రాల్లోకి వెళితే…

కేరళకు చెందిన సీఎస్‌ ఉగేష్, విద్యా చద్రన్‌ భార్యాభర్తలు. అయితే విద్య దుబాయ్ లో ఉద్యోగం చేస్తోంది. ఉగేష్‌ కేరళలోనే నివసిస్తున్నాడు. అయితే విద్య ప్రవర్తనపై ఉగేష్‌కు అనుమానం వచ్చింది. ఆమె మరొకరితో అక్రమ సంబంధం కొనసాగిస్తోందని అనుమానించాడు. దీంతో విజిటింగ్‌ వీసాపై దుబాయ్ చేరుకున్నాడు. భార్య పనిచేస్తున్న ఆఫీసుకు వెళ్లి ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆఫీసులో గొడవ చేయోద్దంటూ విద్య వారిస్తున్నప్పటికీ ఉగేష్‌ ఆగలేదు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఉగేష్‌ తనతోపాటు తెచ్చుకున్న కత్తితో విద్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ కేసులో పోలీసులు ఉగేష్‌ను అదుపులోనికి తీసుకుని కోర్టులో హాజరు పర్చారు. కేసును విచారించిన జడ్జి ఉగేష్‌కు జీవిత ఖైదు అంటే 25 సంవత్సరాల జైలు విధిస్తున్నట్లు తీర్పు చెప్పారు. ఈ తీర్పుపై విద్య కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే విద్య చనిపోవడం, ఉగేష్‌ జైలు పాలు కావ‌డంతో వారి ఇద్దరు పిల్లలు ప్రస్తుతం అనాధలుగా మారారు.

Follow Us
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?
Numerology: మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏ వయస్సులో వస్తుంది..?
పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!
పడుకునే ముందు 2 వెల్లుల్లి రెబ్బలు.. శరీరంలో జరిగే మార్పులు ఇవే!
యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?
యశ్ 'టాక్సిక్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఆయనేనా?
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
బాబా వంగా జ్యోస్యం.. త్వరలో కోరికలు నెరవేర్చుకునే రాశులివే!
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా
తలకు గోరింటాకు వాడుతున్నారా?ప్యూర్ హెన్నా వర్సెస్ బ్లాక్ హెన్నా
ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?
ఫిక్స్‌డ్ డిపాజిట్ సొమ్ము ముందే విత్ డ్రా చేసుకుంటే నష్టమేనా..?
పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!
పెళ్లైన మొదటి సంవత్సరం.. మహిళలు అస్సలే చేయకూడని ఐదు తప్పులివే!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!
రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఈ ట్రైన్ టైమింగ్స్‌లో నో ఛేంజ్!
18 ఏళ్లలో 10,000 పాములు పట్టిన స్నేక్‌మ్యాన్‌ అరుదైన రికార్డు..!
18 ఏళ్లలో 10,000 పాములు పట్టిన స్నేక్‌మ్యాన్‌ అరుదైన రికార్డు..!
ఇక రచ్చ రచ్చే.. బిగ్‏బాస్ 10లోకి సీరియల్ హీరోయిన్..
ఇక రచ్చ రచ్చే.. బిగ్‏బాస్ 10లోకి సీరియల్ హీరోయిన్..