గూగుల్‌లో జాబ్ అప్లై చేస్తున్నారా..? మీ రెజ్యూమ్ 30 సెకన్లలో షార్ట్‌లిస్ట్ అయ్యే 3 సీక్రెట్ టిప్స్!
గూగుల్ వంటి పెద్ద కంపెనీలలోని రిక్రూటర్లు మీ రెజ్యూమ్‌ను చాలా వేగంగా స్కాన్ చేస్తారు. గూగుల్ డబ్లిన్ కార్యాలయంలో రిక్రూటర్‌గా పనిచేస్తున్న అమండా కల్లెన్, 2026 జూలై 22న ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో ఈ విషయాన్ని వెల్లడించారు. రిక్రూటర్లు మీ సామర్థ్యాన్ని వెంటనే గుర్తించకపోతే, వారు దానిని గమనించకపోవచ్చని, మీ CV తిరస్కరించబడవచ్చని ఆమె అంటున్నారు. అయితే, ఈ వీడియోలో ఆమె ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కూడా సూచిస్తున్నారు. మీరు కూడా గూగుల్‌లో ఉద్యోగం చేయాలని కలలు కంటున్నట్లయితే, రిక్రూటర్ అమండా అందించిన ఈ మూడు సీక్రెట్ టిప్స్ మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. ఈ సూత్రాలు పాటిస్తే గూగుల్ వంటి బహుళజాతి కంపెనీల నుండి కాల్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

సాఫ్ట్‌వేర్ లేదా కార్పొరేట్ రంగంలో గూగుల్ వంటి దిగ్గజ కంపెనీలో ఉద్యోగం సాధించాలనేది చాలామంది కల. అయితే వేలాదిగా వచ్చే అప్లికేషన్లలో రిక్రూటర్లు మీ రెజ్యూమ్‌ను కేవలం కొన్ని సెకన్లలోనే స్కాన్ చేసి పక్కన పడేస్తుంటారు. మీ అర్హతలు రిక్రూటర్‌కు వెంటనే కనిపించకపోతే, ఆ సీవీ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యకు పరిష్కారంగా, గూగుల్ డబ్లిన్ కార్యాలయానికి చెందిన ప్రముఖ రిక్రూటర్ అమాండా కల్లెన్ ఇన్స్టాగ్రామ్ వేదికగా మూడు అత్యంత కీలకమైన చిట్కాలను షేర్ చేశారు.
చాలామంది తమ రెజ్యూమ్‌లో తాము చేసిన రోజువారీ పనులు లేదా బాధ్యతలను మాత్రమే జాబితా చేస్తారు. కానీ, గూగుల్ వంటి కంపెనీలు మీ పని వల్ల మునుపటి కంపెనీకి ఎలాంటి ప్రయోజనం కలిగిందో తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతాయి. ఉదాహరణకు, నేను ఒక టీమ్‌ను లీడ్ చేశాను అని రాయడానికి బదులుగా, నేను 10 మంది సభ్యుల టీమ్‌ను నిర్వహించి పని సామర్థ్యాన్ని 20శాతం పెంచాను అని డేటాతో సహా వివరించాలి. మాటల కంటే సంఖ్యలు మీ పనితనాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి.
ప్రతి ఉద్యోగ ప్రకటనలో కంపెనీలు కొన్ని కనీస అర్హతలను పేర్కొంటాయి. మీ రెజ్యూమ్ రిక్రూటర్ల కంట పడాలంటే, జాబ్ డిస్క్రిప్షన్‌లో ఉన్న కీలక పదాలను మీ సీవీలో స్పష్టంగా పొందుపరచాలి. రిక్రూటర్ మీ అర్హతల కోసం వెతుక్కునే పరిస్థితి రాకూడదు. వారు చూడగానే మీ ప్రొఫైల్ ఆ రోల్‌కు సరిగ్గా సరిపోతుందని అర్థం కావాలి.
View this post on Instagram
రెజ్యూమ్ అనేది మీ కెరీర్ ఆత్మకథ కాదు, అది ఒక హైలైట్ రీల్ మాత్రమే. అనవసరమైన సుదీర్ఘ పేరాలు రాయకుండా, స్పష్టమైన ఫాంట్, తగినంత వైట్ స్పేస్, బుల్లెట్ పాయింట్లను ఉపయోగించాలి. సులభంగా చదవడానికి వీలుగా, నేరుగా విషయానికి వచ్చే రెజ్యూమ్‌లకే రిక్రూటర్లు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. మీ రెజ్యూమ్‌లో ఈ మార్పులు చేయడం ద్వారా రిక్రూటర్ల దృష్టిని సులభంగా ఆకర్షించి, ఇంటర్వ్యూ కాల్ పొందే అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చు.




