NEET 2022: నీట్‌ పరీక్షలో అమానుషం.. అమ్మాయిల లో దుస్తులు విప్పించిన సిబ్బంది..

|

Jul 18, 2022 | 6:56 PM

కొల్లం ఆయూర్‌లోని మార్తోమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరీక్షా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. పరీక్ష రాయడానికి వచ్చిన అమ్మాయిలను లో దుస్తులను తొలగించమని అధికారులు ఒత్తిడి చేశారు.

NEET 2022: నీట్‌ పరీక్షలో అమానుషం.. అమ్మాయిల లో దుస్తులు విప్పించిన సిబ్బంది..
Group- 1
Follow us on

NEET EXAM 2022: కేరళలోని కొల్లంలో దారుణం జరిగింది. నీట్‌ ఎగ్జామ్‌ సెంటర్‌లో విద్యార్ధినులను తనిఖీల పేరుతో లో దుస్తులు విప్పించడంపై రగడ రాజుకుంది. ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది . పోలీసులు, ఇన్విజిలేటర్‌పై ఇప్పటికే కేసు నమోదు చేశారు. కొల్లం ఆయూర్‌లోని మార్తోమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరీక్షా కేంద్రంలో ఈ ఘటన జరిగింది. పరీక్ష రాయడానికి వచ్చిన అమ్మాయిలను లో దుస్తులను తొలగించమని అధికారులు ఒత్తిడి చేశారు. దీంతో 100 మందికిపైగా బాలికలను తమ లో దుస్తులు తొలగించి పరీక్షరాసినట్టు తెలుస్తుంది. దీనివల్ల తాము మానసికంగా ఒత్తిడికి గురయ్యాయమని బాలికలు ఆవేదన వ్యక్తంచేశారు. అయితే ఈ అనుచిత ప్రవర్తనను సంబంధిత బాధ్యులు సమర్థించుకున్నట్టు సమాచారం. కాగా.. శూరనాద్‌‌కు చెందిన బాలిక ఈ ఘటనపై తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చాలామంది ఈ ఘటనతో చాలా మంది బాలికలు ఏడ్చారని.. తమకు ఎదురైన వేధింపుల గురించి పోలీసులకు తెలిపింది.

దీంతో బాలికలంతా లో దుస్తులను విప్పి ఓ గదిలో పడేసినట్లు విద్యార్థినులు తెలిపారు. ఈ ఘటన తర్వాత తాము తీవ్ర ఒత్తిడికి లోనయ్యామని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఓ లోహపు వస్తువు దొరకడంతో ఇలా చేయాల్సి వచ్చిందని బాధ్యులు సమర్థించుకున్నట్టు తెలుస్తుంది.

కాగా.. నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. అయితే.. ఎన్టీఏ విడుదల చేసిన మార్గదర్శకాల్లో ఇన్నర్‌వేర్‌ల గురించి పేర్కొనలేదని విద్యార్థినులు తెలిపారు. మరికొన్ని చోట్ల బ్రాలు కూడా విప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. కాగా.. వీటిపై ఎన్టీఏ స్పందించలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..