ఎమ్మెల్యే కొడుకు, 8 మంది స్నేహితులు.. గుట్టుగా చేరి పని మొదలుపెట్టారు.. కట్ చేస్తే, పోలీసుల ఎంట్రీతో..

|

Dec 29, 2024 | 7:25 PM

పులిముగం బోట్ జెట్టీ సమీపంలో గంజాయి వినియోగిస్తుండగా ఎమ్మెల్యే కుమారుడు సహా తొమ్మిది మంది యువకులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి స్వాధీనం కేసులో యు ప్రతిభ కుమారుడు కనీవ్ తొమ్మిదో నిందితుడని తెలిపారు. వారిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ లేదా ఎన్‌డిపిఎస్ యాక్ట్ సెక్షన్ 27 కింద కేసు నమోదు చేశారు.

ఎమ్మెల్యే కొడుకు, 8 మంది స్నేహితులు.. గుట్టుగా చేరి పని మొదలుపెట్టారు.. కట్ చేస్తే, పోలీసుల ఎంట్రీతో..
Kerala Kayamkulam Mla
Follow us on

అతనొక ఎమ్మెల్యే కుమారుడు.. స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు.. అతనితో సహా మొత్తం 9 మంది ఉన్నారు.. ఇంకేముంది అంతా గుట్టుగా చేరి తమ పనిని మొదలుపెట్టారు.. అందరూ గంజాయ్ కొడుతున్నారు.. అప్పుడే పోలీసులు ఎంటరయ్యారు.. కట్ చేస్తే వారి గంజాయ్ గుట్టును రట్టు చేశారు.. అయితే.. దీనిపై ఎమ్మెల్యే కూడా స్పందించారు.. నా కొడుకుపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదంటూ ఏవేవో కథలు చెప్పారు.. కానీ.. అదంతా అబద్దమని.. పోలీసులు ప్రెస్ నోట్ రిలీజ్ చేయ్యడం కేరళలో కలకలం రేపింది..

గంజాయి (మాదక ద్రవ్యాలు) కలిగి ఉన్న తొమ్మిది మందిని ఎక్సైజ్ శాఖ అధికారులు శనివారం అరెస్టు చేశారు.. వారిలో కేరళలోని కాయంకుళం సీపీఎం ఎమ్మెల్యే యు ప్రతిభ కుమారుడు ఉన్నాడు.. అలప్పుజా జిల్లా కుట్టనాడ్‌లోని తకాజిలో గంజాయితో సీపీఎం ఎమ్మెల్యే యు ప్రతిభ కుమారుడు సహా తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. పులిముగం బోట్ జెట్టీ సమీపంలో గంజాయి వినియోగిస్తుండగా ఎమ్మెల్యే కుమారుడు సహా తొమ్మిది మంది యువకులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి స్వాధీనం కేసులో యు ప్రతిభ కుమారుడు కనీవ్ తొమ్మిదో నిందితుడని తెలిపారు. వారిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ లేదా ఎన్‌డిపిఎస్ యాక్ట్ సెక్షన్ 27 కింద కేసు నమోదు చేశారు.

కుట్టనాడ్ ఎక్సైజ్ బృందం శనివారం మధ్యాహ్నం తకాజి ​​పులిముగం బోట్ జెట్టీ సమీపంలో గంజాయి వినియోగిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. యువకులు ఒక్కచోటకు చేరి గంజాయి వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతో.. ఎక్సైజ్ బృందం దాడి చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. గంజాతోపాటు పొగాకు మిశ్రమం స్వాధీనం చేసుకన్నారు. అయితే గంజాయి పరిమాణం తక్కువగా ఉండటంతో యువకులు బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ ఘటనపై సోమవారం ఎక్సైజ్ కోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. ఈ కేసులో ఇద్దరు స్థానికులను సాక్షులుగా చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని.. ఎక్సైజ్ అధికారి తెలిపారు.

తన కొడుకును గంజాయితో అరెస్టు చేశారనే వార్తలను ఎమ్మెల్యే యు ప్రతిభ ఖండించారు. సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలను ఆమె కుమారుడు కూడా తోసిపుచ్చారు. ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడిన ఆమె.. తన కొడుకు తన స్నేహితులతో కూర్చున్నప్పుడు మాత్రమే ప్రశ్నించారని, మీడియా అనవసరంగా రాద్దాంతం చేస్తుందని ఆరోపించారు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. కానీ నా కొడుకు గంజాయితో పట్టుబడలేదని ఆమె చెప్పారు. ఈ వార్త నిజమైతే క్షమాపణలు చెబుతానని, లేని పక్షంలో మీడియా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

కాగా.. పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ.. ఎమ్మెల్యే వాదనల నేపథ్యంలో ఈ గంజాయ్ వ్యవహారం కేరళలో చర్చనీయాంశంగా మారింది..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..