కేరళ హైకోర్టు మరో సంచలన తీర్పునిచ్చింది. అత్యాచార బాధితురాలికు ఉపశమనం కలిగించే తీర్పును వెలువరించింది. ప్రెగ్నెన్సీ తొలగింపుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ వారంలో కేరళ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పుల్లో ఇది కూడా ఒకటి. మొదటిది సెప్టెంబర్ 14 న జరిగింది. అంతకుముందు రెండు కేసుల్లో బాధితులు 26 వారాల కంటే ఎక్కువ గర్భవతిగా ఉన్నారు. మెడికల్ బోర్డ్ సిఫారసు ఆధారంగా గర్భస్రావం అనుమతించబడింది.
తాజా కేసులో బాధితురాలు 16 ఏళ్ల బాలిక.. అంతే కాదు 8 వారాల గర్భవతి కూడా.. గర్భస్రావం చేయించుకునేందుకు ఆమె సంప్రదించిన ప్రైవేట్ ఆసుపత్రి ఒక నేరం జరిగినందున ఈ ప్రక్రియను నిర్వహించడానికి నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది.
భారత్‌లో గర్భస్రావం కొన్నిసందర్భాల్లో చట్టబద్ధమైనదిగా పరిగణిస్తారు. వైద్యపరంగా తప్పని పరిస్థితుల్లో పిండాన్ని తొలగించాల్సి వచ్చినప్పుడు మాత్రమే అబార్షన్‌ను చట్టపరంగా అనుమతిస్తారు. కానీ ఇందుకు కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుంది.
గర్భస్రావం చేయడానికి గర్భిణీ స్త్రీ సమ్మతి మాత్రమే అవసరం. చట్టప్రకారం.. మహిళ తల్లిదండ్రులు లేదా భర్తకు ఈ నిర్ణయంతో సంబంధం ఉండదు. అబార్షన్ చేయించుకునే వారి వయసు 18 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నప్పుడు.. లేదా వారి మతిస్థిమితం సరిగా లేనప్పుడు మాత్రమే సంరక్షకుల సమ్మతి తప్పనిసరిగా ఉండాలి. అయితే కేరళ కోర్టు తీసుకున్న తీర్పు ఇప్పుడు బాధితులకు పెద్ద ఉపశమనంగా భావిస్తున్నారు.
బాధితురాలి తండ్రి అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఏదైన ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలని సూచించింది. భారత్‌లో గర్భస్రావం కొన్నిసందర్భాల్లో చట్టబద్ధమైనదిగా పరిగణిస్తారు. వైద్యపరంగా తప్పని పరిస్థితుల్లో పిండాన్ని తొలగించాల్సి వచ్చినప్పుడు మాత్రమే అబార్షన్‌ను చట్టపరంగా అనుమతిస్తారు. కానీ ఇందుకు కొన్ని మార్గదర్శకాలు పాటించాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి: Crime News: మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. భర్త వేధింపులు భరించలేక.. మర్మాంగాన్ని కోసిన భార్య
TTD Board: టీటీడీ బోర్డు నియామకంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం.. ప్రభుత్వ జీవో సస్పెండ్..