ఓ బాలుడి ఫిర్యాదుతో అవాక్కైన కేరళ పోలీసులు..

తన అక్కతోపాటుగా ఆమె స్నేహితులను అరెస్ట్‌ చేయాలంటూ పోలీసులును ఆశ్రయించాడు. తిరువనంతపురంకు చెందిన ఎనిమిదేళ్ల ఉమర్‌ నాదిర్‌ మూడో తరగతి చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ వల్ల బయటకు వెళ్లి తన స్నేహితులతో ఆడుకోలేకపోతున్నాడు. అదే సమయంలో అతని అక్క, ఇరుగుపొరుగున ఉన్న ఆమె స్నేహితురాళ్లతో కలిసి ఇంట్లోనే దొంగ-పోలీసు, లూడో వంటి ఆటలు ఆడుకుంటున్నారు. దీంతో ఉమర్‌ తనకు కూడా అవకాశం కల్పించాలన్నాడు. అందుకు వారు అంగీకరించలేదు. ఇదే విషయాన్ని ఉమర్‌ తన తండ్రికి చెప్పాడు. అందుకు ఆయన […]

ఓ బాలుడి ఫిర్యాదుతో అవాక్కైన కేరళ పోలీసులు..
Follow us

|

Updated on: May 14, 2020 | 6:04 PM

తన అక్కతోపాటుగా ఆమె స్నేహితులను అరెస్ట్‌ చేయాలంటూ పోలీసులును ఆశ్రయించాడు. తిరువనంతపురంకు చెందిన ఎనిమిదేళ్ల ఉమర్‌ నాదిర్‌ మూడో తరగతి చదువుతున్నాడు. లాక్‌డౌన్‌ వల్ల బయటకు వెళ్లి తన స్నేహితులతో ఆడుకోలేకపోతున్నాడు. అదే సమయంలో అతని అక్క, ఇరుగుపొరుగున ఉన్న ఆమె స్నేహితురాళ్లతో కలిసి ఇంట్లోనే దొంగ-పోలీసు, లూడో వంటి ఆటలు ఆడుకుంటున్నారు. దీంతో ఉమర్‌ తనకు కూడా అవకాశం కల్పించాలన్నాడు. అందుకు వారు అంగీకరించలేదు. ఇదే విషయాన్ని ఉమర్‌ తన తండ్రికి చెప్పాడు. అందుకు ఆయన పోలీసులుకు ఫిర్యాదు చేయమని జోక్‌ చేశాడు. అంతే దాన్ని సీరియస్‌గా తీసుకున్న ఉమర్‌.. ఇంగ్లిష్‌లో ఓ ఫిర్యాదు రాసి ఉంచుకున్నాడు. ఓ కేసు విషయంపై తన ఇంటి సమీపంలోకి వచ్చిన పోలీసులకు ఆ లేఖను అందజేశాడు. తన అక్క, ఆమె స్నేహితులు తనను వాళ్లతో కలిసి ఆడనివ్వడం లేదని లేఖలో పేర్కోన్నాడు. ఎన్నిసార్లు అడిగినా వినిపించుకోవడం లేదని.. అందుకే వాళ్లని అరెస్ట్‌ చేయాలని కోరాడు.బాలుడి ఫిర్యాదుపై స్పందించిన కేరళ పోలీసులు.. మరుసటి రోజు ఉదయం ఉమర్‌ ఇంటి వెళ్లారు. ఉమర్‌తో కలిసి ఆడుకోవాల్సిందిగా అతని అక్కకు, మిగతా బాలికలకు సూచించారు.అయితే తమ్ముడు తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాడని అస్సలు ఊహించలేదన్నారు ఉమర్‌ అక్క.