‘ఫ్రీ వ్యాక్సిన్ ప్లీజ్ !’ కేరళ అసెంబ్లీలో తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం, రాష్ట్రాలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లేఖ

| Edited By: Anil kumar poka

Jun 02, 2021 | 6:58 PM

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలంటూ కేరళ అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్నిఆమోదించింది. ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు.

ఫ్రీ వ్యాక్సిన్ ప్లీజ్ !  కేరళ అసెంబ్లీలో తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం,   రాష్ట్రాలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లేఖ
Kerala Assembly Unanimously Passed Resolution For Free Vaccine
Follow us on

దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలంటూ కేరళ అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్నిఆమోదించింది. ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. రాష్ట్రంలో టీకామందుల కొరత తీవ్రంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే దీన్ని పంపిణీ చేయాలని ఈ తీర్మానంలో కోరారు. కోవిద్ పై పోరుకుగాను దేశ వ్యాప్తంగా టీకామందులను ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఉందని, దీనివల్ల సమాజంలో అన్ని వర్గాలను కోవిద్ బారి నుంచి రక్షించుకోవచ్చునని ఇందులో పేర్కొన్నారు. తొలి కోవిద్ వేవ్ దేశంలో ఎకానమీని తీవ్రంగా దెబ్బ తీసిందని, ఇప్పుడు దేశం రెండో వేవ్ ని ఎదుర్కొంటోందన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు. ఈ మహమ్మారిపై జరిపే పోరులో అంతా చేతులు కలపాలని వీణా జార్జి ఈ తీర్మానంలో కోరారు. కాగా రాజకీయ విభేదాలను పక్కనబెట్టి విపక్ష యూడీఎఫ్ సభ్యులు కూడా దీనికి ఆమోదం తెలిపారు.

ఇలా ఉండగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. కేంద్రం అనుసరిస్తున్న వ్యాక్సిన్ ప్రొక్యూర్ మెంట్ విధానం విషయంలో అందరూ ఏకాభిప్రాయానికి రావాలని, వ్యాక్సిన్ కోసం ఆయా రాష్ట్రాలు పరస్పరం ఒకదానికొకటి పోటీ పడరాదంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. కేంద్ర ప్రభుత్వం టీకామందులను సేకరించి అన్ని రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేయాలని కోరారు. ఈ మేరకు రెండు పేజీల లేఖను ఆయన పంపారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా ఇలాగే రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ పంపాలని డిమాండ్ చేసిన విషయం గమనార్హం.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : ఆకాశంలో మరో అద్భుతం ..ఈ సారి గంటకు పైగా వీక్షించే అవకాశం..: solar eclipse Viral Video

మోడీ జీ నా దగ్గర డబ్భులు లేవు..కేంద్రం తీరుపై ఝార్ఖండ్ సీఎం తీవ్ర అసంతృప్తి : Hemant Soren Fire video

విజయవాడ రైల్వే స్టేషన్ పై కరోనా ఎఫెక్ట్.. వెలవెలబోతున్న రైల్వే స్టేషన్లు :Andhra Pradesh Railway stations video